పానీపూరీ వివాదం.. భయానక వాతావరణం - వినియోగదారులు భాగ్పట్
🎬 Watch Now: Feature Video
వినియోగదారులను ఆహ్వానించే క్రమంలో తలెత్తిన గొడవ లాఠీలు, కర్రలతో కొట్టుకునే వరకు వెళ్లింది. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్ భాగ్‌పట్‌లో జరిగింది. ఈ వివాదం తొలుత ఇద్దరు ఛాట్ వ్యాపారుల మధ్య తలెత్తిందని పోలీసులు తెలిపారు. తమ షాపుకు రమ్మంటే తమ షాపుకు రమ్మని పోటీ పడి వినియోగదారులను ఆహ్వానిస్తున్న క్రమంలో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. ఈ క్రమంలో ఇరువురికి మద్దతుగా వచ్చిన వారు పరస్పరం కర్రలు, లాఠీలతో దాడికి దిగారు. దీంతో ఆ ప్రాంతంలో కొద్దిసేపు భయానక వాతావరణం నెలకొంది. ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.