ముగిసిన చార్ధామ్ యాత్ర- బద్రీనాథ్ ఆలయం మూసివేత - badrinath yatra winter season
🎬 Watch Now: Feature Video
ఈ ఏడాది ప్రసిద్ధ చార్ధామ్ యాత్ర ఇక ముగిసింది. శీతాకాం మొదలైన నేపథ్యంలో బద్రీనాథ్ ఆలయ ద్వారాలను శనివారం మూసివేశారు. సంప్రదాయం ప్రకారం పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ ప్రధాన పూజారి ఈశ్వరి ప్రసాద్ నంబూద్రి.. శనివారం సాయంత్రం 6.45 గంటలకు ఆలయ ద్వారాలను మూసివేశారు. ఈ ఏడాది బద్రీనాథ్‌ను 1.97లక్షల మంది దర్శించుకున్నారని అధికారులు తెలిపారు. శనివారం ఒక్కరోజే.. 4,000కు మందికిపైగా బద్రీనాథుడి దర్శనం కోసం వచ్చారని చెప్పారు. ఛార్‌ధామ్‌లో భాగమైన కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి ఆలయాలను ఇప్పటికే మూసివేశారు.
Last Updated : Nov 20, 2021, 11:44 PM IST