బైక్ను భుజంపై మోస్తూ కొండ దాటిన బాహుబలి - హిమాచల్ ప్రదేశ్ చంబా
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-14403391-986-14403391-1644305082479.jpg)
కొండ గుట్టలపై నుంచి బైక్ను భుజంపై మోస్తూ కిందకు దిగాడు ఓ యువకుడు. అతనికి మరికొందరు సాయం చేశారు. నేరేడు నాలా సమీపంలోని నక్రోడ్-చాజు వద్ద కొండ చరియలు విరిగి పడడం వల్ల రోడ్డు మూతపడింది. బండరాళ్లతో రోడ్డంతా నిండిపోవడం వల్ల అటు వైపుగా వెళ్తున్న యువకుడు.. ఇతరుల సాయంతో భుజంపై బైక్ను మోసుకుని మరో చివరకు చేరుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.