లైవ్ వీడియో: రెండు బైక్లను ఢీకొట్టిన కారు - ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం
🎬 Watch Now: Feature Video
ద్విచక్రవాహనంపై వెళుతున్న వ్యక్తిని ఓ కారు అతివేగంగా ఢీకొట్టింది. అంతటితో ఆగక పక్కనే మరో బైక్ వద్ద ఉన్న ముగ్గురు వ్యక్తులపైకి దూసుకెళ్లింది. ఒడిశా సుబర్ణాపుర్ జిల్లాలోని రాంపుర్ పెట్రోల్ బంక్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. బైక్పై ఉన్న వ్యక్తి హెల్మెట్ ధరించడం వల్ల ప్రాణాపాయం తప్పింది. మరో బైక్ వద్ద ఉన్న ముగ్గురికి గాయాలయ్యాయి.