సీఎం పొరపాటుతో రూ.లక్షలు విలువ చేసే డ్రోన్ దగ్ధం - డ్రోన్ కాల్చేయడం అసోం సీఎం

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 22, 2021, 7:00 PM IST

ప్రపంచ ఖడ్గమృగ దినోత్సవం (world rhino day 2021) సందర్భంగా అసోంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ పొరపాటున డ్రోన్​ను కాల్చేశారు. భారీ సంఖ్యలో ఖడ్గమృగాల కొమ్ములను దహనం చేసిన ఆయన.. నిప్పు అంటించేందుకు వినియోగించిన డ్రోన్​ను రిమోట్​తో ఆపరేట్ చేస్తూ నియంత్రణ కోల్పోయారు. దీంతో కొమ్ములను దహనం చేసే వాటికలో డ్రోన్ పడిపోయింది. ఈ కార్యక్రమం కోసమే డ్రోన్​ను ప్రత్యేకంగా దిల్లీ నుంచి తెప్పించారు. దీని ధర రూ. లక్షల్లో ఉంటుందని సమాచారం. ఖడ్గమృగాల కొమ్ముల్లో ఔషధ గుణాలున్నాయన్న అపోహలను తొలగించేందుకు ఈ కార్యక్రమం నిర్వహించారు. 1979 నుంచి ఇప్పటివరకు వివిధ సంఘటనల్లో స్వాధీనం చేసుకున్న 2,479 కొమ్ములను గోలాఘాట్‌ జిల్లాలోని కాజీరంగ నేషనల్​ పార్క్​ సమీపంలో బొకాఖట్‌ కవాతు మైదానంలో బహిరంగంగా దహనం చేశారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.