వామ్మో.. ఎంత పెద్ద కింగ్ కోబ్రా! - 15 feet King cobra in Tamil nadu
🎬 Watch Now: Feature Video
వర్షాకాలం ప్రారంభమవడం వల్ల ఆహ్లాదకరమైన వాతావరణంలో పాముల సంచారం పెరుగుతోంది. ఇటీవల ఒడిశాలో 10 అడుగుల కింగ్ కోబ్రా తారసపడగా.. తాజాగా తమిళనాడు కోయంబత్తూర్ జిల్లాలోని నరసిపురం గ్రామంలోని ఓ రైతు పొలంలో 15 అడుగుల కోబ్రా దర్శనమిచ్చింది. దీంతో భయాందోళన చెంది అటవీ శాఖాధికారులకు సమాచారం అందించాడా రైతు. ఆ సర్పాన్ని రక్షించి... శిరివానీ అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. 10 నుంచి 13 అడుగుల సగటు పొడవు కలిగిన ఈ పాము అత్యంత విషపూరితమైంది.