ETV Bharat / entertainment

నార్త్​లో ఈమె వెరీ పాపులర్! - రేఖ, శ్రీదేవితో గట్టి పోటీ - పేదల కోసం ఆస్పత్రి కట్టించారుగా! - SOUTH ACTRESS IN BOLLYWOOD

బాలీవుడ్​ హీరోయిన్లతో పోటీపడి దక్షిణాదికి తిరిగొచ్చేసిన సౌత్​ స్టార్ - ఇప్పుడెలా ఉన్నారంటే?

Actress Competed With Rekha And Sridevi
Actress Competed With Rekha And Sridevi (Film Poster)
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 21, 2025, 3:57 PM IST

Actress Competed With Rekha And Sridevi : దక్షిణాదిలో సూపర్‌ స్టార్‌డమ్‌ సొంతం చేసుకుని బాలీవుడ్‌లో అడుగుపెట్టిన హీరోయిన్‌లు చాలా మందే ఉన్నారు. హిందీ ఇండస్ట్రీలో కూడా తమ కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ బాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్లతో పోటీపడి, దక్షిణాదికి తిరిగొచ్చేసిన నటి గురించి విన్నారా? ఆమె గురించి తెలుసుకోవాలనుందా? అయితే ఈ స్టోరీ చదివేయండి.

బాలీవుడ్ అరంగేట్రం
తన నటనా జీవితాన్ని చైల్డ్ ఆర్టిస్ట్‌గా ప్రారంభించారు కోమల్ మహువకర్ అలియాస్ రూపిణి. తన తొలి సినిమా 'మిలీ' (1975). ఆ తర్వాత 'కొత్వాల్ సాబ్', 'ఖూబ్‌సూరత్‌'లో కూడా యాక్ట్‌ చేశారు. అయితే చైల్డ్​ ఆర్టిస్ట్​గా పాపులరైన ఆమెకు పెద్దయ్యాక లీడ్‌ రోల్స్‌ రావడం మొదలయ్యాయి. దీంతో రిషి కపూర్, అనిల్ కపూర్, రాజేష్ ఖన్నా వంటి ప్రముఖ బాలీవుడ్ స్టార్‌ల సరసన పని చేసే అవకాశం వచ్చింది. 'పాయల్ కీ ఝంకార్', 'మేరీ అదాలత్' సినిమాలతో పాపులర్‌ అయ్యారు. అప్పటి ప్రముఖ తారలు రేఖ, శ్రీదేవితో పోటీ పడ్డారు.

దక్షిణాదిలో సక్సెస్
1980ల చివరి నాటికి రూపిణి తమిళం, తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. మలయాళం, కన్నడ చిత్రాల్లో కూడా నటించారు. 'అపూర్వ సహోదర్గల్', 'మైఖేల్ మదన కామ రాజు', 'రాజా చిన్న రోజా', 'కెప్టెన్ ప్రభాకరన్' లాంటి హిట్‌లు అందించారు. కమల్ హాసన్, రజనీకాంత్, విజయకాంత్ వంటి దక్షిణ భారత సూపర్ స్టార్లతో కలిసి పని చేశారు.

అద్భుతమైన క్లాసికల్ డ్యాన్సర్
రూపిణి మంచి క్లాసికల్ డ్యాన్సర్. ఆమె భరతనాట్యం, కూచిపూడి, ఒడిస్సీ, కథక్‌లలో శిక్షణ సంపాదించారు. ఈ నైపుణ్యం కూడా ఆమె మంచి సినిమా అవకాశాలు తీసుకొచ్చి పెట్టాయి.

పెళ్లితో సినిమాలకు దూరం
1995లో మోహన్ కుమార్‌ను రూపిణి వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత సినిమా పరిశ్రమకు దూరమయ్యారు. వీరికి అనీషా అనే కుమార్తె ఉంది. రూపిణి ముంబయికి వెళ్లిన తర్వాత పేదలకు వైద్య సేవలు అందించేందుకు చెంబూర్‌లో యూనివర్సల్ హార్ట్ హాస్పిటల్‌ను ప్రారంభించారు. 2005లో ఆమె ఇండస్ట్రీకి తిరిగి వచ్చారు. కానీ ఈ సారి టెలివిజన్‌పై దృష్టి పెట్టారు. సహారా వన్ టీవీ షో 'వో రెహ్నే వాలీ మెహ్లాన్ కీ'లో కనిపించారు. 2020లో సన్ టీవీలో 'చిత్తి 2' అనే తమిళ సీరియల్​లో యాక్ట్‌ చేశారు.

మార్కెటింగ్‌ నుంచి సినిమాల్లోకి- చిరుతలను దత్తత తీసుకుని పాపులర్​- ఎవరో తెలుసా?

బిగ్‌బీతో ఫస్ట్​ మూవీ, ఆమిర్‌తో బ్లాక్​బస్టర్ - ఆ కారణం వల్ల ఓ సినిమా నుంచి ఔట్​! - ఎవరా నటి?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.