బుడ్డోడు మామూలు అదృష్టజాతకుడు కాదు.. మూడో అంతస్తు నుంచి పడినా.. - nasik boy fell from building third floor
🎬 Watch Now: Feature Video
మహారాష్ట్ర నాసిక్ జిల్లాలో ఆశ్చర్యపరిచే ఘటన జరిగింది. భవనం మూడో అంతస్తు నుంచి కిందపడినా.. అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డాడో బాలుడు. జిల్లాలోని చాందినీ చౌక్ అల్సానా అపార్ట్‌మెంట్ మూడో అంతస్తుపై నుంచి ఫైజాన్ సద్దాం షేక్(3) అనే బాలుడు.. తన ఇంటి బాల్కనీలో ఆడుకుంటూ.. గ్రిల్ నుంచి జారి కిందపడ్డాడు. వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు తల్లిదండ్రులు. అయితే.. ఫైజాన్కు ఎలాంటి గాయాలు కాలేదు. దీంతో వైద్యులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Last Updated : Feb 3, 2023, 8:20 PM IST