ప్రేమ జంటను చితకబాదిన గ్రామస్థులు.. అల్లుడిపై అత్తింటివారి దాడి - హరియాణా న్యూస్​

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Apr 28, 2022, 9:48 AM IST

Updated : Feb 3, 2023, 8:23 PM IST

హరియాణాలోని ఫతేహాబాద్​లో ఓ ప్రేమజంటను చితకబాదారు గ్రామస్థులు. యువకుడితో కలిసి ఉండటం చూసిన బాలిక కుటుంబసభ్యులు.. ఆగ్రహంతో ఇద్దరినీ పిడిగుద్దులు గుద్దారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. అయితే దీనిపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. ఫతేహాబాద్​లో జరిగిన మరో ఘటనలో భర్త కుటుంబంపై దాడిచేశారు భార్య కుటుంబసభ్యులు. అంతకుముందే అత్త, కోడలు మధ్య గొడవ జరిగింది. దీంతో ఆ మహిళ తన కుటుంబ సభ్యులకు చెప్పింది. ఆగ్రహానికి గురైన వారు.. అల్లుడు, అతడి తల్లిని ఇంట్లోకి ప్రవేశించి కొట్టారు. ఈ ఘటన సంబంధించిన దృశ్యాలన్నీ ఇంట్లోని సీసీటీవీలో రికార్డయ్యాయి. దీంతో ఈ వీడియో సోషల్​మీడియాలో వైరల్​గా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.