లంబోర్గినిగా మారిన మారుతీ స్విఫ్ట్ సీఎంకు మెకానిక్ కానుక - లంబోర్గిని కారు
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-17100395-thumbnail-3x2-asdf.jpg)
అసోం కరీంగంజ్‌కు చెందిన నూరుల్ హక్ మారుతీ స్విఫ్ట్ కారును లంబోర్గినిగా మార్చేశాడు. విలాసవంతమైన లంబోర్గిని కారును తలపించేలా పది లక్షల రూపాయలతో పాత కారుకు మార్పులు చేసి ప్రశంసలు అందుకుంటున్నాడు. జిల్లాలోని భాంగా ప్రాంతంలో మెకానిక్‌గా పనిచేస్తున్నాడు నూరుల్. స్పోర్ట్స్ కార్లపై మక్కువతోనే పాత కారును లంబోర్గినిగా మార్చినట్లు తెలిపాడు. ఈ కారు తయారీకి నాలుగు నెలల సమయం పట్టిందని చెప్పాడు. ఈ కారును ఓ ప్రదర్శనలో అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తిలకించారు. దీన్ని ఆయనకే గిఫ్ట్‌గా ఇస్తానని నూరుల్ చెబుతున్నాడు. త్వరలో మరో పాత కారును ఫెరారీలా మార్చనున్నట్లు చెప్పాడు. ప్రభుత్వం సహకరిస్తే ఇలాంటి మరిన్ని ప్రాజెక్టులు చేపడతానని అంటున్నాడు.
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST