హిమాచల్ ప్రదేశ్కు మంచు దుప్పటి.. టూరిస్టులు ఫుల్ ఖుష్ - himachal latest snowfall news
🎬 Watch Now: Feature Video
శీతాకాలం కావడం వల్ల హిమాచల్ ప్రదేశ్లో భారీగా మంచువర్షం కురుస్తోంది. లాహౌల్ వ్యాలీ మొత్తం మంచు దుప్పటిని కప్పుకుంది. లాహౌల్, కిన్నౌర్ ప్రాంతాలలో భారీగా మంచు వర్షం కురవడం వల్ల అక్కడి ప్రాంతమంతా శ్వేతవర్ణంలో దర్శనమిస్తోంది. బాగా మంచు కురవడం వల్ల చెట్లన్నీ తెల్లని పూలు పూసినట్లుగా కనిపిస్తున్నాయి. హిమాచల్లో ఈ సీజన్లో మొదటి మంచువర్షం ఇదే. దీనితో మంచుతో స్వర్గదామంలా దర్శనమిస్తున్న వ్యాలీ అందాలతో పర్యటకులు మైమరచిపోతున్నారు. హిమపాతం వల్ల అక్కడ ఉష్ణోగ్రతలు బాగా పడిపోయాయి. పలు ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు అధికారులు.
Last Updated : Feb 3, 2023, 8:38 PM IST