కుమారుడి ఎంగేజ్మెంట్లో అంబానీ దంపతుల జోర్దార్ డ్యాన్స్ - ముకేశ్ అంబానీ ఫ్యామిలీ లేటెస్ట్ న్యూస్
🎬 Watch Now: Feature Video
దేశంలోనే అత్యంత సంపన్న కుటుంబాల్లో ఒకటైన అంబానీ, మర్చంట్ ఇళ్లలో పెళ్లి సందడి మొదలైంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ, నీతా అంబానీ రెండో తనయుడు అనంత్ అంబానీకి, విరెన్ మర్చంట్, శైల దంపతుల కుమార్తె రాధికా మర్చంట్‌కు గురువారం అంగరంగ వైభవంగా నిశ్చితార్థం జరిగింది. ముంబయిలోని అంబానీల నివాసమైన ఆంటిలియాలో నిశ్చితార్థ కార్యక్రమం నిర్వహించారు. గుజరాతీ హిందూ కుటుంబ సంప్రదాయాలను అడుగడుగునా పాటించారు.
అనంత్ సోదరి ఈషా అంబానీ మర్చంట్ ఇంటికి వెళ్లి వారిని వేడుకకు ఆహ్వానించారు. సాయంత్రం అంబానీ నివాసంలో గణపతి ఆరాధనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. వివాహ ఆహ్వాన పత్రికను అందరికీ చదివి వినిపించారు. గుజరాతీ సంప్రదాయాలైన గోల్‌ధన, చునారి విధి నిర్వహించారు. ఈ సందర్భంగా నీతా అంబానీ.. కుటుంబం చేసిన నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అనంతరం కుటుంబ సభ్యుల సమక్షంలో.. అనంత్, రాధిక ఉంగరాలు మార్చుకున్నారు. పెద్దల ఆశీర్వాదం తీసుకున్నారు.
అనంత్-రాధిక నిశ్చితార్థం వేడుకకు సినీ రాజకీయ ప్రముఖులు తరలివచ్చి ఆశీర్వాదం అందించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే మాజీ మంత్రి ఆదిత్య థాకరే, ఆయన తల్లి రష్మి థాకరే ఆంటిలియాకు వెళ్లి.. అనంత్-రాధికలను ఆశీర్వదించారు. దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందూల్కర్ తన భార్యతో కలిసి అంబానీ ఇంట వేడుకకు హాజరయ్యారు.
సంప్రదాయ వస్త్రధారణలో వచ్చిన బాలీవుడ్ తారాగణం ఆకట్టుకుంది. బాలీవుడ్ అందం ఐశ్వర్యరాయ్.. కూతురు ఆరాధ్యతో కలిసి వేడుకకు వచ్చింది. షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ తల్లితో కలిసి అంబానీ ఇంట సందడి చేశాడు. కత్రినా కైఫ్ కూడా నిశ్చితార్థ వేడుకకు హాజరైంది. అగ్రనటుడు సల్మాన్‌ఖాన్ ఆయన మేనకోడలు అలీజ్ అగ్నిహోత్రి కలిసి వచ్చారు. రణ్‌వీర్ సింగ్-దీపికా పదుకొణె దంపతులు, అనన్య పాండే, జాన్వీ కపూర్, ఖుషీ కపూర్, సారా అలీఖాన్, వరుణ్ ధావన్, అక్షయ్‌కుమార్ వేడుకకు హాజరయ్యారు.