రివర్స్ గేర్లో డ్రైవింగ్ పోటీలు.. ఫీట్లు అదిరిపోయాయిగా
🎬 Watch Now: Feature Video
దేశంలోని వివిధ ప్రాంతాల్లో రకరకాల పోటీలు జరుగుతూ ఉంటాయి. అలానే మహారాష్ట్రలో వినూత్న రీతిలో ఆటో రిక్షా డ్రైవింగ్ పోటీలు జరిగాయి. సాంగ్లీ జిల్లాలోని హరిపుర్ అనే గ్రామంలో ఈ వింత పోటీలను నిర్వహించారు. సంగమేశ్వర్ యాత్రలో భాగంగా రివర్స్ గేర్లో వెనుకకు ఆటో పోటీలను నిర్విహించారు. ఈ పోటీల్లో కొంత మంది ఆటో రిక్షా డ్రైవర్లు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ వింత పోటీలను చూడడానికి చుట్టుపక్కల ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. అయితే ఈ పోటీల్లో ఓ చిన్న ప్రమాదం కూడా జరిగింది. ఓ పోటీదారుడు ఆటోను వెనుకకు నడుపుతుండగా.. అది బ్యాలెన్స్ కోల్పోయింది. దీంతో ఆ ఆటో రిక్షా బోల్తా పడింది. అయితే ఈ ప్రమాదంలో డ్రైవర్ సురక్షితంగా బయటపడం వల్ల అందరూ ఊపిరిపీల్చుకున్నారు. అయితే ఈ పోటీలు కేవలం వినోదం కోసం మాత్రమే నిర్వహించామని.. రోడ్లపై ఇటువంటి ఫీట్లు చేయవద్దని పోటీ నిర్వహకులు హెచ్చరించారు.