బైక్‌పై ప్రేమజంట హల్చల్.. నడిరోడ్డుపై రొమాన్స్ చేస్తూ.. - నడిరోడ్డుపై ప్రేమికులు హల్చల్
🎬 Watch Now: Feature Video
lovers jolly bike ride: కర్ణాటకలో ఓ ప్రేమికుల జంట నడిరోడ్డుపై హల్చల్ చేసింది. పల్సర్ బైక్ పెట్రోల్ ట్యాంక్‌పై ప్రియురాలిని కూర్చోపెట్టుకుని రైడ్‌కు వెళ్లాడు ఓ యువకుడు. గట్టిగా ఒకరినొకరు హత్తుకుని రోడ్డుపై ప్రయాణించారు. లారీలు, బస్సులు తమకేవీ అడ్డుకావన్నట్టుగా నడిరోడ్డుపై దూసుకెళ్లారు. వీరి ఔట్‌డోర్ రొమాన్స్‌ను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. బైక్‌పై వెళ్లిన వ్యక్తి హెచ్డీ కోటేకు చెందిన స్వామిగా చామనగర్ ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
Last Updated : Feb 3, 2023, 8:22 PM IST