జాతీయ జెండాకు గజరాజు సెల్యూట్ - ఏనుగు సెల్యూట్ వైరల్ వీడియో
🎬 Watch Now: Feature Video
తమిళనాడులోని ఓ ప్రముఖ ఆలయ ప్రాంగణంలో జాతీయ జెండాకు సెల్యూట్ చేసింది ఏనుగు. తిరునల్వేలి జిల్లాలోని ప్రసిద్ధ ఆలయమైన నెలైయప్పర్ గుడి ప్రాంగణంలో జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు ఆలయ నిర్వాహకులు. ఈ సందర్భంగా గుడి ప్రధాన పూజారి జెండాను ఎగురవేశారు. గుడిలో దేవుడి సేవకు వినియోగించే గాంధీమతి అనే గజరాజు మువ్వెన్నల జెండాకు వందనం చేసింది. ఈ కార్యక్రమంలో ఏనుగు సెల్యూట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనంతరం ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి మిఠాయిలు పంచారు.
Last Updated : Feb 3, 2023, 8:39 PM IST