బస్సు నడుపుతుండగా డ్రైవర్‌కు మూర్ఛ - Driver sudden seizure while driving bus
🎬 Watch Now: Feature Video
అయ్యప్పన్ అనే వ్యక్తి ఓ ప్రవేటు బస్సు నడుపుతున్నాడు. బస్సు పుదుచ్చేరిలోని కారైకాల్ నుంచి అంబగరత్తూర్ వెళ్తోంది. సెల్లూరు సమీపంలోకి రాగానే అయ్యప్పన్కు హఠాత్తుగా మూర్ఛ వచ్చింది. అనంతరం బస్సు ఓ షాపువైపు దూసుకెళ్లి ఆగింది. దీంతో అయ్యప్పన్‌తో పాటు అందులో ఉన్న 10 మందికి పైగా ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వారందరినీ కారైకాల్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్‌కు మూర్ఛ వచ్చిన దృశ్యాలు బస్సులో ఉన్న సీసీటీవీలో రికార్డయ్యాయి.
Last Updated : Feb 3, 2023, 8:31 PM IST