ETV Bharat / state

సంధ్య థియేటర్ ఘటన - ఆ ఇద్దరిని అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టు ఆదేశం - PUSHPA 2 MOVIE INCIDENT

పుష్ప-2 నిర్మాతలకు హైకోర్టులో దక్కిన ఊరట - అరెస్టు చేయవద్దని ఉన్నత న్యాయస్థానం ఆదేశం - మధ్యంతర ఉత్తర్వులు జారీ

Sandhya Theatre Stampede
Sandhya Theatre Stampede (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 2, 2025, 9:16 AM IST

Sandhya Theatre Stampede : రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైన సంధ్య థియేటర్​ తొక్కిసలాట ఘటనకు సంబంధించి నమోదైన కేసులో పుష్ప-2 సినిమా నిర్మాతలు యలమంచిలి రవిశంకర్​, యెర్నేని నవీన్​లకు హైకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో దర్యాప్తు చేయవచ్చని, అయితే వారిని అరెస్ట్​ చేయరాదని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. సంధ్య థియేటర్​ తొక్కిసలాటలో ఓ మహిళ మృతి నేపథ్యంలో చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారని, ఆ కేసును కొట్టివేయాలని కోరుతూ రవిశంకర్​, నవీన్​లు హైకోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు. ఈ పిటిషన్​పై జస్టిస్​ కె.సుజన మంగళవారం విచారణ చేపట్టి, ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ ఘటనతో పిటిషనర్లకు ఎలాంటి సంబందం లేదని తొలుత పిటిషనర్​ తరఫు న్యాయవాది ఎన్​.నవీన్ ​కుమార్​ వాదనలు వినిపించారు. ఎఫ్​ఐఆర్​లో పేర్కొన్న అభియోగాలు ఏవీ వారికి వర్తించని తెలిపారు. హీరో అల్లుఅర్జున్​ థియేటర్​కు వస్తున్నట్లు నిర్మాతల కార్యాలయ సిబ్బంది థియేటర్​ నిర్వాహకులకు, పోలీసు అధికారులకు సమాచారం ఇచ్చారని వివరించారు.

ఘటన జరిగిన రోజు సీనియర్​ అధికారులైన ఏసీపీ, డీసీపీలు థియేటర్​కు వచ్చి భద్రతను పరిశీలించారని పేర్కొన్నారు. పిటిషనర్​ న్యాయవాది వాదనలు విన్న న్యాయమూర్తి పిటిషనర్లను అరెస్టు చేయరాదని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. పిటిషనర్లు దర్యాప్తునకు సహకరించాలని ఆదేశించారు. ఈ విషయంపై కౌంటర్​ దాఖలు చేయాలని పోలీసులకు, ఫిర్యాదుదారుకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

వారి బెయిల్​ పిటిషన్​ ఈ నెల 6వ తేదీకి వాయిదా : అలాగే ఇదే కేసులో అరెస్టయిన థియేటర్​ మేనేజర్​ అడ్ల శరత్​ చంద్రనాయుడు, అల్లు అర్జున్​ వ్యక్తిగత సిబ్బంది చెరుకు రమేశ్​, శ్రీరాములు రాజు బెయిలు మంజూరు చేయాలంటూ పిటిషన్​ దాఖలు చేశారు. ఈ పిటిషన్​ విచారణను ఈ నెల 6వ తేదీకి వాయిదా వేశారు.

అసలేం జరిగింది? : డిసెంబరు 4వ తేదీన పుష్ప-2 బెనిఫిట్​ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్​ రోడ్​లోని సంధ్య థియేటర్​ వద్దకు రాత్రి సమయంలో హీరో అల్లు అర్జున్​ వచ్చారు. ఈ సందర్భంగా తమ అభిమాన హీరోను చూసేందుకు జనం ఎగబడ్డారు. ఈ క్రమంలో కాస్త తోపులాట జరిగింది. అభిమానులను నియంత్రించేందుకు పోలీసులు వారిని చెదరగొట్టారు. దీంతో అక్కడ తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ తొక్కిసలాటలో తల్లి రేవతి, ఆమె కుమారుడు కిందపడిపోయారు. ఈ క్రమంలో వారిని పోలీసులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రేవతి మృతి చెందగా, కుమారుడు శ్రీతేజ్ ఇంకా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ కేసులో ఇప్పటికే సుమారు 12 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

'పుష్ప' తీసిన ప్రాణం : సంధ్య థియేటర్​కు అల్లుఅర్జున్ - తొక్కిసలాటలో మహిళ మృతి

సంధ్య థియేటర్​ ఘటన - అల్లు అర్జున్​ అరెస్ట్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.