హిమాలయాల నుంచి జనావాసాల్లోకి గోధుమ రంగు ఎలుగుబంట్లు

🎬 Watch Now: Feature Video

thumbnail
జమ్ముకశ్మీర్‌లో అరుదైన గోధుమ రంగు ఎలుగుబంట్లు కనువిందు చేశాయి. శ్రీనగర్​లోని లేహ్​​ హైవే సమీపంలోని మినీమార్గ్‌ ప్రాంతంలో ఇవి కనిపించాయి. ఆహారం కోసం స్థానిక అడవి నుంచి ఎలుగులు జనారణ్యంలోకి ప్రవేశించాయి. ఇందులో తల్లి ఎలుగు బంటితో పాటు మరో పిల్ల ఎలుగుబంటి ఉన్నట్లు గ్రామస్థులు గుర్తించారు. స్థానికులకు ఏ మాత్రం ఇబ్బంది కలిగించకుండా వచ్చిన దారినే అవి వెనుదిరిగాయి. హిమాలయాల్లో అత్యంత అరుదుగా కనిపించే ఈ భారీ ఎలుగులు 250 కిలోల వరకు బరువుంటాయని స్థానికులు తెలిపారు. రెండు వేల ఐదు వందల అడుగుల ఎత్తులో ఇవి జీవిస్తుంటాయని పేర్కొన్నారు.
Last Updated : Feb 3, 2023, 8:31 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.