దిల్లీ మంత్రికి తిహాడ్ జైలులో మసాజ్‌లు - తిహాడ్ జైల్లో సత్యేంద్ర జైన్
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-16971446-thumbnail-3x2-minister.jpg)
మనీలాండరింగ్ కేసులో అరెస్టైన దిల్లీ మంత్రి సత్యేందర్‌కు సంబంధించిన ఓ వీడియో బయటకు వచ్చింది. తిహాడ్ జైలులో ఉంటున్న జైన్‌కు సకల సౌకర్యాలు అందుతున్నట్లు అందులో స్పష్టమవుతోంది. జైలులో ఆయనకు ఓ వ్యక్తి మసాజ్ చేస్తుండటం వీడియోలో కనిపిస్తోంది. కాళ్లకు నూనె రాసి మర్దనా చేశాడా వ్యక్తి. ఇది సెప్టెంబరు 13వ తేదీ వీడియో కాగా ఆ తర్వాతి రోజు కూడా బాడీ మసాజ్‌తోపాటు తలకు మర్దనా చేసిన వీడియో కూడా బయటకు వచ్చింది. మరికొంతమంది కూడా ఆయన పక్కన ఉన్నారు. గదిలో బిస్లెరీ వాటర్ సీసాలు, ఆయన పడకపై టీవీ రిమోట్ కనిపిస్తున్నాయి. మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సత్యేందర్ జైన్ ఈ ఏడాది మే 30న అరెస్టయ్యారు. 2017లో సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ ఆయన్ను అరెస్టు చేసింది. సత్యేందర్‌కు జైలులో వీఐపీ మర్యాదలు చేస్తున్నారనే ఆరోపణలు రాగా దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలను కోర్టుకు ఈడీ అందించింది. ఇవే ఆరోపణలపై తిహాడ్ జైలు సూపరింటెండెంట్ ఇటీవలే సస్పెన్షన్‌కు గురయ్యారు.
Last Updated : Feb 3, 2023, 8:33 PM IST