Parents Should Spend Time with Kids For Their Development : నేటి పోటీ ప్రపంచంలో చదువుకు ప్రాధాన్యం పెరిగింది. చదువే భవిత అదే జీవితం అన్నట్లుగా మారిపోయింది. తరగతి గదిలో నేర్చుకున్న పాఠాలను ఇంటి వద్ద చదివినప్పుడే పిల్లలు చదువులో ముందుంటారు. కొందరు తల్లిదండ్రులు ఇద్దరూ ఉద్యోగాలు, వ్యాపారాలు చేసినా ఆదివారం పిల్లలతో 2, 3 గంటలు గడుపుతున్నారు. వారు ఎలా చదువుతున్నారు? ఏ సబ్జెక్టులో వెనుకబడి ఉన్నారో తెలుసుకుంటున్నారు. పిల్లల చదువులు, ఎదుగుదలలో తమవంతు ధర్మాన్ని పాటిస్తున్నారు. కొందరు తల్లిదండ్రులు ఆదివారం వస్తే తమ పిల్లలతో ఎలా గడుపుతున్నారో ఈటీవీ భారత్‌తో పంచుకున్నారు
'నేను ఫార్మసీ కాలేజీలో లెక్చరర్‌గా చేస్తున్నా. మా ఆయన విద్యుత్ శాఖలో విధులు నిర్వహిస్తున్నారు. ఉద్యోగాల విషయంలో ఇద్దరం బిజీ అయినప్పటికీ పిల్లల బాగోగులు ఎక్కువగా నేను చూసుంటాను. రోజు సాయంత్రం వేళ హోంవర్క్ చేశారా లేదా అని ఆరా తీస్తాం. చేయకుంటే దగ్గర ఉండి చేయిస్తాం. ఆదివారం మాత్రం ఒకటి, రెండు గంటలు వారికే కేటాయిస్తాం. వాళ్లు పుస్తకాలు, కాపీలు తిరిగేస్తాం. తప్పొప్పులు చూస్తాం. ఏమైనా సందేహాలు ఉంటే తీరుస్తాం.' డా.జి.మాధురి చెప్పారు
"నేను ఒక విద్యాసంస్థలో బోధనేతర ఉద్యోగం చేస్తున్నాను. మా ఆయన శ్యాంసుందర్ రెడ్డి బిజినెస్ చేస్తారు. వారంలో ఆరు రోజులు బిజీగా ఉన్నా సాయంత్రం అరగంట పాఠ్యాంశాలు, హోంవర్క్ అంశాలు చదివిస్తాం. భావాలు పంచుకుంటాం. ఆదివారం వస్తే వారంలో చేసిన ప్రగతి చర్చిస్తాం. పాఠశాల వాతావరణం ఎలా ఉంది? ఏ విషయంలోనైనా ఉపాధ్యాయులు మందలించారా అని వారితో కలిసిపోయి చర్చిస్తాం. చెప్పిన వాటిలో ఏది మంచి, ఏది చెడని సమీక్షిస్తాం, ఏదైన సబ్జెక్టులో కష్టంగా అనిపిస్తే అర్థమయ్యేలా చెబుతాను. ఒకటి, రెండు గంటలు విద్యా విషయాలు పంచుకుంటాం. కాస్త విరామం కోసం అవసరమైతే సినిమాకు లేదా ఆహ్లాద ప్రాంతాలకు వెళ్తుంటాం." - ఎం.పద్మ, కరీంనగర్
'మేను హైదరాబాద్‌లోని ప్రముఖ కంపెనీలు సాఫ్ట్వేర్ ఉద్యోగులం. రేకుర్తిలో ఉండి వర్క్ ఫ్రం హోం చేస్తున్నాం. వారంలో ఒక్క ఆదివారం మాత్రమే మా ఇద్దరమ్మాయిలతో ఎక్కువ సేపు గడిపే సమయం దొరుకుతుంది. ఒత్తిడి లేని వాతావరణంలో పిల్లలతో మాట్లాడతాం. వారికి అర్థం కాని విషయాలను చెబుతాం. సిలబస్ ఎంతవరకు జరిగిందో చూస్తాం. ఆ తర్వాత కరెంట్ అఫైర్స్, చారిత్రక అంశాలు, జియోగ్రఫీ, నూతన ఏఐ సాంకేతికత లాంటి విషయాలను వారితో చర్చిస్తాం. పేపర్లో ప్రధాన అంసాలను వారికి వివరిస్తాం. దాదాపు రెండు గంటలు పుస్తకాలతో గడిపి సరదాగా బయటకు వెళ్తాం.' అని పాతూరి హరితారెడ్డి తెలిపారు.
పిల్లలు తినే జెల్లీ ప్రమాదకరమే! - జీహెచ్ఎంసీ పరీక్షల్లో సంచలన విషయాలు
'పిల్లలకు ఫోన్ ఇస్తే మాటలు రావు'- ఆటిజం, ఏడీహెచ్‌డీ వచ్చే ఛాన్స్! మరి ఏం చేయాలి?