2259 ప్రాణాలు బలిగొన్న భోపాల్ దుర్ఘటనకు 38 ఏళ్లు - భోపాల్ విషవాయువు లీకేజీ ఘటన
🎬 Watch Now: Feature Video
భోపాల్ దుర్ఘటనకు 38 ఏళ్లు పూర్తయ్యాయి. విషవాయువు లీకేజీతో 2259 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన ఈ శతాబ్దంలోనే అతిపెద్ద పారిశ్రామిక ప్రమాదం. 1984 డిసెంబర్ 2వ తేదీ అర్ధరాత్రి భోపాల్ నగరంలో జనం గాఢనిద్రలో ఉండగా ఒక్కసారిగా విషవాయువు చుట్టేసింది. ఊపిరాడని ప్రజలు ప్రాణ భయంతో బయటకు పరుగుతీశారు. మృత్యువుతో జరిగిన ఈ పరుగు పందెంలో చాలా మంది ఓడిపోయారు. వీరిలో ఎక్కువ మంది మహిళలు, వృద్ధులు, వికలాంగులు, పిల్లలే. నోటివెంట నురగలు కక్కుతూ ప్రాణాలు కోల్పోయారు. మూగజీవాల మరణాలకు లెక్కేలేదు. తెల్లారేసరికి భోపాల్ మరుభూమిగా మారిపోయింది. ఆ తర్వాత జరిగిన న్యాయపోరాటం ఇంతకు మించిన విషాదంగా పరిణమించింది. దశాబ్దాలు గడిచిపోతున్నా బాధితులకు న్యాయం జరగలేదు.
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST