మహిళ ఫోన్​ కొట్టేసి చెట్టెక్కిన కోతి.. కాల్ రాగానే ఆన్సర్​ చేసి... - monkey funny trolls

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Mar 30, 2022, 4:45 PM IST

Updated : Feb 3, 2023, 8:21 PM IST

Monkey Cell Phone: పుదుచ్చేరి రైతు మార్కెట్​లో ఓ కోతి సందడి చేసింది. కొబ్బరి బోండాలు అమ్ముకునే మహిళ దగ్గరి నుంచి మొబైల్​ ఎత్తుకెళ్లి చెట్టెక్కింది. ఆమె తన వ్యాపారాన్ని చూసుకుంటుండగా.. సడెన్​గా వచ్చి వానరం చేసిన పనికి స్థానికులు షాక్​ అయ్యారు. చాలా మంది ఫోన్​ ఇవ్వమని కోతిని అడగడం ప్రారంభించారు. మధ్యలో ఓసారి ఫోన్​ రింగ్​ అయితే.. లిఫ్ట్​ చేసి మాట్లాడటానికి ప్రయత్నించింది కోతి. అయితే ఓ గంట తర్వాత.. మళ్లీ ఫోన్​ అక్కడే వదిలి వెళ్లడం విశేషం. ఈ దృశ్యాలను అక్కడి జనం తమ ఫోన్లలో బంధించారు.
Last Updated : Feb 3, 2023, 8:21 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.