'కొత్త జట్ల రాకతో ఐపీఎల్ నాణ్యత దెబ్బతింటుంది..కానీ' - వెంకంట
🎬 Watch Now: Feature Video
IPL 2022: ముంబయి వాంఖడే స్టేడియం వేదికగా ఐపీఎల్ 15వ సీజన్ ప్రారంభంకానుంది. ఈ సీజన్ నుంచి రెండు కొత్త జట్లు అరంగేట్రం చేయడం సహా మిగతా జట్లలో భారీ మార్పులు జరిగాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ క్రికెట్ విశ్లేషకులు సి. వెంకటేశ్‌తో ఈటీవీ భారత్ ప్రతినిధి ముఖాముఖి నిర్వహించారు. విజయం సాధించే అవకాశాలు ఎవరికి ఎక్కువగా ఉన్నాయనేది ఇప్పుడేమీ చెప్పలేమని వెంకటేష్ అన్నారు. రెండు కొత్త జట్ల వల్ల కొంత నాణ్యత దెబ్బతినే అవకాశం ఉన్నప్పటికీ క్రీడాభిమానులకు కనువిందు చేయనుందని చెప్పారు. ప్రేక్షకుల సమక్షంలో ఐపీఎల్ నిర్వహించడం వల్ల క్రీడాకారులకు ఉత్సాహం, ఉత్తేజాన్ని ఇస్తుందన్నారు. మిడిలార్డర్ సమస్యతో వైఫల్యం చెందుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కొత్త ఆటగాళ్లతో పటిష్ఠంగా మారిందని పేర్కొన్నారు. వాంఖడే మైదానం అటు బ్యాటర్లుకు, ఇటు బౌలర్లకు అనూకూలమేనని ఆయన చెప్పారు.
Last Updated : Feb 3, 2023, 8:21 PM IST