భారీ స్థాయిలో పునీత్ ఆఖరి చిత్రం రిలీజ్ థియేటర్లలో బారులు తీరిన అభిమానులు - పునీత్ రాజ్‌కుమార్ గంధద గుడి రిలీజ్
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-16765562-thumbnail-3x2-eeee.jpg)
కన్నడ దివంగత స్టార్ హీరో పునీత్ రాజ్‌కుమార్ ఆఖరి చిత్రం 'గంధద గుడి' శుక్రవారం ప్రేక్షకలు ముందుకు వచ్చింది. ఈ డాక్యుమెంటరీ కర్ణాటకలోని 225కి పైగా థియేటర్లలో విడుదలైంది. ఈ డాక్యుమెంటరీని చూసి అభిమానులే కాకుండా పలువురు సెలబ్రిటీలు కూడా ఎమోషనల్ అవుతున్నారు. శుక్రవారం తెల్లవారుజామున భారీ సంఖ్యలో అభిమానులు థియేటర్ల ముందు బారులు తీరారు. అప్పును వెండితెరపై చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. అన్ని థియేటర్ల ముందు పునీత్ భారీ కటౌట్లు దర్శనమిస్తున్నాయి. పునీత్ కటౌట్లకు ఫ్యాన్స్ పాలాభిషేకం చేశారు. అయితే 'గంధద గుడి' డాక్యుమెంటరీకి అమోఘవర్ష దర్శకత్వం వహించారు. దీనిని పునీత్ రాజ్‌కుమార్‌కు చెందిన పీఆర్కే ప్రొడక్షన్స్ నిర్మించింది. కర్ణాటకలోని ప్రకృతి అందాలు, వన్యప్రాణులు, అటవీ ప్రజల జీవనాన్ని డాక్యుమెంటరీలో చక్కగా చూపించారు. అప్పు చేసిన ఈ అరుదైన ప్రయత్నాన్ని అందరూ ఇష్టపడుతున్నారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఈ సినిమాకు పన్ను మినహాయింపు ప్రకటించారు. 2021లో 46 ఏళ్ల వయసులో గుండెపోటుతో పునీత్ రాజ్‌కుమార్ మరణించారు.
Last Updated : Feb 3, 2023, 8:30 PM IST