ETV Bharat / sukhibhava

పాపాయికి మురి'పాలు' పట్టిస్తున్నారా?

గర్భం దాల్చాక ఎన్ని సందేహాలు ఉంటాయో... ప్రసవమయ్యాకా అంతే ఉంటాయి. వాటిల్లో ఎక్కువశాతం పాపాయికి పట్టే పాలకు సంబంధించే ఉంటాయి. బాలింతగా ఎలాంటి ఆహారం తీసుకోవాలి? పట్టే పాలు పాపాయికి సరిపోతున్నాయా లేదా? అసలు పాలెప్పుడు పట్టాలి? ఇలా ఎన్నో సందేహాలు తల్లిని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. అయితే ఇవేవీ పెద్ద సమస్యలు కాదు... భయపడాల్సిన పనీలేదు. మీ సందేహాలకు పరిష్కారాలు చూసేద్దాం రండి...!

clear diet and tips for breast feeding mothers in telugu
పాపాయికి మురి'పాలు' పట్టిస్తున్నారా?
author img

By

Published : Sep 16, 2020, 10:31 AM IST

ప్రసవమయ్యాక శరీరంలో ఎన్నో మార్పులు కనిపిస్తాయి. ముఖ్యంగా రొమ్ము ఆకృతిలో. అయితే గర్భం దాల్చినప్పటి నుంచే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే గర్భం దాల్చాక అవి సున్నితంగా మారతాయి. నొప్పి కూడా ఉంటుంది. ముఖ్యంగా రొమ్ములు దృఢత్వాన్ని కోల్పోకుండా నిద్రపోయేటప్పుడు కూడా బ్రా వేసుకోవాలి. చనుమొనల్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. అయితే సబ్బు వాడకూడదు. సబ్బుతో చనుమొనలు పొడిబారతాయి. ప్రతీరోజూ స్నానం చేశాక కాస్త మాయిశ్చరైజర్‌ రాస్తే మంచిది. మూడో త్రైమాసికంలో అవి లోపలికి నొక్కుకుపోయినట్లుగా ఉంటే ల్యూబ్రికెంట్‌ సాయంతో ఇవతలకు వచ్చేలా లాగాలి. ఒకవేళ మరీ లోపలికి వెళ్లిపోయినా, తిరగేసినట్లు ఉన్నా... డాక్టర్‌ని సంప్రదించాలి. ప్రసవమయ్యాక పాలు పట్టే విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. పాపాయికి పాలిచ్చాక రొమ్ముల్ని ఎప్పటిప్పుడు శుభ్రం చేసుకుని పొడివస్త్రంతో తుడుచుకోవాలి.

బాలింతల్లో ఇవి సహజం...

  • ప్రసవమయ్యాక బాలింతల రొమ్ముల ఆకృతిలో మార్పులు కనిపిస్తాయి. పాపాయి పుట్టిన రెండుమూడు రోజులకు రొమ్ములు వాచినట్లు అవుతాయి. దాంతో అసౌకర్యంగా అనిపిస్తుంది. మొదటి కొన్నివారాల్లో చనుమొనలు నొప్పిగా ఉంటాయి. గర్భం దాల్చినప్పటినుంచీ సరైన సంరక్షణ లేకపోవడమే దానికి కారణం. ఈ సమస్య తాత్కాలికమే కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. అయితే వాటికి ఆసరా ఉండేందుకు నాణ్యమైన బ్రాలు వాడాలి. ఎప్పటికప్పుడు పాలు ఒక్క రొమ్ముతో కాకుండా రెండింటి నుంచీ ఇవ్వాలి. నొప్పిగా అనిపిస్తే వేడినీటితో కాపడం పెట్టాలి. అలాగే పాలు పట్టడం అయిపోయాక ఐసుముక్కలతో ఐదు నుంచి పదినిమిషాలు అద్దండి.
  • బాలింతలు పాలు పట్టే సమయంలో పాపాయి మీదే దృష్టి పెట్టడం కాకుండా కూర్చునే భంగిమ సరిగా ఉండేలా చూసుకోవాలి. కూర్చుని, పాపాయిని పడుకోబెట్టుకుని పాలు పట్టడం మంచిది.
  • సాధారణంగా పాలిస్తున్నప్పుడు చనుమొనలు ముడతలు పడతాయి. అలానే కొన్నిసార్లు ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌ వల్ల కూడా ఇలా కావచ్చు. పాపాయి నోట్లోని ఫంగస్‌ తల్లి చనుమొనలకు తగలడం వల్లే ఆ సమస్య ఎదురవుతుంది. దాంతో అవి వాచి, ముడుచుకుపోవచ్చు. దానికారణం ఇన్‌ఫెక్షనే అయితే తల్లీబిడ్డలిద్దరూ చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. వైద్యులు ప్రత్యేకమైన క్రీం లేదా ఆయింట్‌మెంట్‌ని సూచిస్తారు.

పాలు సరిపోతున్నాయా...

  • దాదాపు తొంభైశాతం మంది తల్లుల్లో తాము పట్టే పాలు పిల్లలకి సరిపోతున్నాయా లేదా అనే సందేహం ఉంటుంది. అలాగే అసలు పాపాయికి ఆకలి వేస్తోందో లేదో తెలుసుకోలేకపోతున్నాం అంటారు కూడా. కొన్ని గమనించుకుంటే సందేహాలు తీరిపోతాయి. అయితే ఈ విషయంలో ప్రతి పాపాయీ భిన్నమే. వాళ్ల అవసరాన్ని బట్టి ప్రతి రెండు లేదా మూడు గంటలకోసారి పాలు తాగించాలి. కొన్నిసార్లు నాలుగు గంటలకోసారి తాగొచ్చు. పాపాయి వేళ్లు నోట్లో పెట్టుకోవడం, ఏడవడం వంటివన్నీ ఆకలికి సంకేతాలే. ఆరోగ్యంగా పుట్టిన పాపాయి రోజులో ఎనిమిది నుంచి పన్నెండుసార్లు పాలు తాగాలి. ఒకవేళ అలా తాగకపోతే నిద్రపోతున్నా సరే లేపి పట్టాలి. ఇలా వేళకు పాలు పట్టడం వల్ల పాలవృద్ధి కూడా ఉంటుంది. అధ్యయనాల ప్రకారం... పాలు పట్టే సమయాన్ని తగ్గించడం, తరచూ పట్టకపోవడం వల్ల పాల ఉత్పత్తి తగ్గుతుంది. పాలలో కొవ్వుశాతం కూడా ఉండదు. పాపాయి పెరిగాక ఇంకాస్త ఎక్కువగా తాగొచ్చు. ఒకవిడత పాలు పట్టాక పాపాయి నిద్రపోతోందనే ఉద్దేశంతో లేపకపోవడం సరికాదు. మూడుగంటలు దాటి ఇంకా నిద్రపోతున్నా, తరచూ ఇదే కనిపిస్తున్నా వైద్యుల్ని సంప్రదించడం మంచిది.
  • బరువు పెరగాలంటే... పాపాయి పుట్టిన కొత్తల్లో ముర్రుపాలు తాగుతున్నప్పుడు రోజులో ఒకటి లేదా రెండు న్యాపీల అవసరమే పడుతుంది. ఎప్పుడయితే పాలు సమ్దృద్ధిగా రావడం మొదలవుతాయో... అంటే మూడు లేదా నాలుగు రోజులకు పాపాయికి ఆరు నుంచి ఎనిమిది న్యాపీలు పడతాయి. దీనికితోడు రోజులో రెండునుంచి ఐదుసార్లు మలవిసర్జన కూడా జరుగుతుంది. ఇక, రోజులు గడిచేకొద్దీ రోజులో ఎనిమిది నుంచి పన్నెండుసార్లు పాలు తాగించాలి. అలాగే ఒక్కో రొమ్ము నుంచి పది నుంచి ఇరవై నిమిషాలు పాలు తాగాలి. గుటకలు వేస్తోన్న శబ్దం కూడా వినిపించాలి. ఈ పద్ధతిలో పాలు తాగితే పాపాయి వారంలో కనీసం నాలుగు నుంచి ఏడు ఔన్సుల బరువు పెరుగుతుంది. చురుగ్గా ఉంటుంది. చర్మం బిగుతుగా, మెరిసే ఛాయతో కనిపిస్తుంది.
    clear diet and tips for breast feeding mothers in telugu
    ఓట్స్ కు ఓటు వేయాల్సిందే..

తల్లిపాలకు వెల్లుల్లి
  • పాలు ఇవ్వడం మొదలుపెడితే గనుక వాటంతట అవే వస్తాయి. కానీ కొన్నిసార్లు రాకపోవచ్చు. అలాంటప్పుడు ఆహారంలో ఈ జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. మెంతుల్లో మాంసకృత్తులూ, సి విటమిన్‌, నియాసిన్‌, పొటాషియం ఉంటాయి. ఈ పోషకాలన్నీ పాల ఉత్పత్తికి తోడ్పడతాయి. వీటిని తీసుకోవడం వల్ల 24 నుంచి 72 గంటల్లో మార్పు కనిపిస్తుంది. ఒక్కసారి పాల ఉత్పత్తి పెరిగాక వాటిని మానేయొచ్చు. వీటిని ఎలా తీసుకోవాలంటే నేరుగా నానబెట్టుకుని తినొచ్చు లేదా ఏదయినా పదార్థంలో కలుపుకునీ తినొచ్చు. మధుమేహం ఉన్న తల్లులు మాత్రం వీటిని అంతగా తీసుకోకపోవడం మంచిది. మెంతుల్ని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెరస్థాయులు తగ్గే అవకాశాలు ఎక్కువ కావడమే దానికి కారణం. బాలింతలు తీసుకోవాల్సిన మరో ఆహారం ఓట్స్‌. వీటిలో బీటా గ్లూకాన్స్‌, మాంసకృత్తులూ, పీచూ, పిండిపదార్థాలు ఉంటాయి. ఈ పోషకాలు కూడా పాల ఉత్పత్తికి తోడ్పడతాయి. పైగా ఓట్స్‌ తీసుకోవడం వల్ల శరీరానికి క్యాల్షియం, ఇనుము అందుతాయి. కొలెస్ట్రాల్‌ కూడా తగ్గుతుంది. ఇది కూడా పాలవృద్ధికి తోడ్పడుతుంది. వెల్లుల్లి కూడా పాల వృద్ధికి తోడ్పడుతుంది. అయితే వెల్లుల్లిని తినడం ఇష్టంలేనివారు అవి మాత్రల రూపంలో దొరుకుతాయి. వాటిని ఎంచుకోవచ్చు. బొప్పాయీ, క్యారెట్‌, పాలకూర, సొరకాయ, బీరకాయ... వంటివీ పాలవృద్ధికి తోడ్పడే పదార్థాలే. గర్భిణిగా ఉన్నప్పుడు తీసుకున్న జాగ్రత్తలు ప్రసవం అయ్యాక నిర్లక్ష్యం చేస్తారు. కానీ అది సరికాదు. ఆ తరువాత కూడా పాలూ, పండ్లరసాలూ, పండ్లు తీసుకోవాలి. వేళకు ఆహారం తినాలి.

పాలు పట్టడం వల్ల లాభాలు

పాపాయికి...

  • తల్లిపాలు పాపాయికి పోషణ అందిస్తాయి. మాంసకృత్తులూ, కొవ్వులూ, పిండిపదార్థాలూ, ద్రవాలన్నీ ఈ పాల నుంచే అందుతాయి. మొదటి ఆరు నెలలు వీటిని పడితే చాలు. నీళ్లూ, ఇతర ద్రవ, ఘన పదార్థాలు అవసరం లేదు.
  • పాపాయిలో వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్‌ఫెక్షన్లు వచ్చే అవకాశాలు చాలా తక్కువ.
  • డయేరియా, వాంతులు కూడా తక్కువే. ఛాతీ, చెవి ఇన్‌ఫెక్షన్లు కూడా అంతగా రావు. తల్లిపాలల్లోని యాంటీబాడీలూ, మాంసకృత్తులే అందుకు కారణం.
  • ఓ అధ్యయనం ప్రకారం...తల్లిపాలు తాగే పిల్లలు భవిష్యత్తులో ప్రతిభావంతులు అవుతారు. మరో అధ్యయనం ప్రకారం భవిష్యత్తులో ఆ పిల్లలకు స్థూలకాయం, అధిబరువూ, అధికరక్తపోటూ, కొలెస్ట్రాల్‌, ఎగ్జిమా, మధుమేహం, క్యాన్సర్‌, ఉబ్బసం వచ్చే అవకాశాలు చాలా తక్కువ.

తల్లికి...

  • రొమ్మూ, అండాశయ క్యాన్సర్లు వచ్చే అవకాశాలు చాలామటుకూ తగ్గుతాయి.
  • టైపు 2 మధుమేహం అదుపులో ఉంటుంది. ప్రసవానంతరం వచ్చే డిప్రెషన్‌ ప్రభావం కూడా తగ్గుతుంది. సులువుగా బరువు తగ్గుతారు.

ఇదీ చదవండి: చనుబాల నాణ్యత పెంచే ఆయుర్వేదం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.