వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలంలో శ్రీ కొత్తకొండ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. గురువారం కనుమ పండుగ సందర్భంగా భక్తులు స్వామివారి దర్శనానికి పోటెత్తారు.
ముందుగా వీరభద్రుడిని దర్శించుకుని.. స్వామికి ప్రీతిపాత్రమైన గుమ్మడికాయలను, కోరమీసాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం స్వామి వారి ప్రసాదంతో పాటు దాత సురేందర్ రెడ్డి అందిస్తున్న వృక్ష ప్రసాదాన్ని అందుకునేందుక పెద్ద సంఖ్యలో క్యూలో నిలబడ్డారు.
జాతరలో రంగులరాట్నం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈనెల 18వ తేదీన అగ్నిగుండాల ప్రవేశంతో ఈ బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.
ఇవీ చూడండి : 'మకరజ్యోతి' దర్శనం.. భక్తజన పరవశం