సిద్దిపేట రూరల్ సీఐ, చిన్నకోడూరు ఎస్సైపై హెచ్చార్సీలో ఫిర్యాదు - farmer complaint to hrc
సివిల్ వివాదాల్లో తల దురుస్తూ... తీవ్ర వేధింపులకు గురి చేస్తున్నారని సిద్దిపేట రూరల్ సీఐ, చిన్నకోడూరు ఎస్సైపై హెచ్చార్సీలో ఓ రైతులు ఫిర్యాదు చేశాడు. తాము చెప్పిన్నట్లు భూ సెటిల్మెంట్ చేసుకోకపోతే రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని సీఐ, ఎస్సై బెదిరింపులకు పాలుపడుతున్నారని రైతు ఆందోళన వ్యక్తం చేశారు. సీఐ, ఎస్సైపై కఠిన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని హెచ్చార్సీని ఆశ్రయించాడు.
సిద్దిపేట జిల్లా రూరల్ సీఐ, చిన్న కోడూరు ఎస్సైలపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు నమోదైంది. సీఐ, ఎస్సై సివిల్ వివాదాల్లో తల దూరుస్తూ... తీవ్ర వేధింపులకు గురి చేస్తున్నారని మల్లారం గ్రామానికి చెందిన సందబోయిన ఎల్లయ్య అనే రైతు హెచ్చర్సీలో ఫిర్యాదు చేశాడు. తమ పూర్వీకుల నుంచి సంక్రమించిన ఏకరన్నర భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నట్లు బాధిత రైతు కమిషన్కు వివరించారు.
అదే ప్రాంతానికి చెందిన కొంతమంది రైతుల వద్ద డబ్బులు తీసుకొని సీఐ సురేందర్ రెడ్డి, ఎస్సై సాయి కుమార్... తమ భూమిలో నుంచి రోడ్డు వేయించారని తెలిపారు. రోడ్డు వేయవద్దని సీఐను వేడుకున్నప్పటికీ పట్టించుకోలేదని... అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా చితకబాదరని ఆవేదన వ్యక్తం చేశాడు.
తాము చెప్పిన్నట్లు భూ సెటిల్మెంట్ చేసుకోకపోతే రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని సీఐ, ఎస్సై బెదిరింపులకు పాలుపడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అగ్రకులస్థులకు వత్తాసు పలుకుతూ... తమ పొట్టమీద కొడుతున్న సీఐ, ఎస్సైలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రైతు ఎల్లయ్య హెచ్చార్సీని వేడుకున్నాడు.