IMD Director Dr Nagaratna on Weather Report : రాష్ట్రంలో రాగల మూడు, నాలుగు రోజుల పాటు పొగమంచు ప్రభావం అధికంగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. తూర్పు, ఈశాన్య జిల్లాలతో పాటు హైదరాబాద్ పరిసర జిల్లాల్లో పొగమంచు కురుస్తుందని వాతావరణ శాఖ సంచాలకురాలు డాక్టర్ నాగరత్న తెలిపారు. తూర్పు, ఆగ్నేయ గాలుల వల్ల పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని అన్నారు. ఫిబ్రవరి 15 వరకు వాతావరణంలో భిన్న పరిస్థితులు నెలకొంటాయని చెప్పారు. ఒక్కొక్కప్పుడు చల్లగాలులు, మరొక్కప్పుడు వేడిగాలులు వీస్తాయని, ఫిబ్రవరి 15 తర్వాత వేడి తీవ్రత పెరుగుతుందంటున్న వాతావరణ శాఖ సంచాలకులు డాక్టర్ నాగరత్నతో ఈటీవీ ప్రతినిధి జ్యోతికిరణ్ ముఖాముఖి.
"తెలంగాణలో వచ్చే మూడు, నాలుగు రోజులు పొగమంచు ఎక్కువగా ఉంటుంది. తెల్లవారుజామున చలిగా ఉంటుంది. తూర్పు, ఆగ్నేయ గాలుల వల్ల పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఫిబ్రవరి 15 వరకు వాతావరణంలో భిన్న పరిస్థితులు నెలకొంటాయి."- డాక్టర్ నాగరత్న, వాతావరణ శాఖ సంచాలకులు
రాత్రిళ్లు, తెల్లవారుజామున అత్యవసర ప్రయాణాలైతేనే చేయండి
ఎదురుగా ఉన్నా కనిపించట్లే! - లైట్లు వేసినా బండి ముందుకు కదలట్లే!!