ETV Bharat / business

మారుతి సుజుకీ కార్ల ధరలు భారీగా పెంపు- ఈ డేట్​లోగా కొంటే పాత రేట్లకే! - MARUTI SUZUKI HIKE CAR PRICE

వాహనాల ధరలను పెంచనున్న దేశీయ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ- ఫిబ్రవరి 1న అమల్లోకి కొత్త ధరలు- కారు మోడల్‌ బట్టి రూ.32,500 వరకు పెంపు

Maruti Suzuki Hike Car Price
Maruti Suzuki Hike Car Price (X @ Maruti Suzuki)
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 23, 2025, 4:07 PM IST

Maruti Suzuki Hike Car Price : తమ కంపెనీకి చెందిన అన్ని మోడల్ కార్ల ధరలను పెంచుతున్నట్లు మారుతీ సుజుకీ ఇండియా గురువారం ప్రకటించింది. పెరుగుతున్న తయారీ, నిర్వహణ ఖర్చులు ఆధారంగా దాదాపు అన్ని మోడళ్ల ధరలను గరిష్ఠంగా రూ.32,500 వరకు పెంచుతున్నట్లు తెలిపింది. ఈ ధరలు ఫిబ్రవరి ఒకటో తేదీన అమల్లోకి వస్తాయని తెలిపింది.

వినియోగదారులపై అదనపు భారం పడుకుండా చూసేందుకు ప్రయత్నిస్తున్నామని, కానీ నిర్వహణ, కారు తయారు చేయడానికి చేస్తున్న ఖర్చులు పెరగడం వల్ల ఈ నిర్ణయం తీసుకోవడం తప్పడం లేదని కంపెనీ పేర్కొంది. పెరుగుతున్న ఖర్చుల భారాన్ని తగ్గించుకునేందుకు కొంతవరకు వినియోగదారులకు బదిలీ చేయక తప్పడం లేదని తెలిపింది. ఈ నేపథ్యంలోనే కార్ల ధరలను ఫ్రిబవరి 1 నుంచి పెంచుతున్నట్లు కంపెనీ వెల్లడించింది.

కార్లపై పెరిగిన ధరల వివరాలు

  • మారుతి సుజుకి సెలీరియో ధర రూ. 32,500 వరకు, ప్రీమియం మోడల్ ఇన్విక్టో ధర రూ. 30,000 వరకు పెరగనుంది.
  • కంపెనీకి చెందిన ప్రముఖ మోడల్ వ్యాగన్-ఆర్ ధర రూ.15,000, స్విఫ్ట్ ధర రూ.5,000 వరకు పెరగనుంది.
  • ఎస్​యూవీ బ్రెజ్జా, గ్రాండ్ విటారా ధరలు వరుసగా రూ. 20,000, రూ. 25,000 మేర పెరగనున్నాయి.
  • చిన్న కార్ల ఆల్టో కె-10 ధరలు రూ.19,500, ఎస్-ప్రెస్సో ధర రూ.5,000 వరకు పెరగనుంది.
  • ప్రీమియం కాంపాక్ట్ మోడల్ బాలెనో ధర రూ.9,000, కాంపాక్ట్ ఎస్‌యూవీ ఫ్రాంక్స్ ధరపై రూ.5,500, కాంపాక్ట్ సెడాన్ డిజైర్ ధర రూ.10,000 వరకు పెరుగున్నాయి.
  • మారుతీ సుజుకీ ఎర్టిగా కారు ధరపై రూ.15,000, ఈరో రూ.12,000, సూపర్ క్యారీ ధరపై రూ.10,000 వరకు పెరుగున్నాయి.
  • ఇగ్నిస్ కారు ధరపై రూ.6,000, సియాజ్ ధరపై రూ.15,000, ఎక్స్​ఎల్ -6పై రూ.10, 000 జిమ్నీ ధరపై రూ.15,000 పెరగనున్నాయి.

ప్రస్తుతం మారుతీ సుజుకి కంపెనీ ఆల్టో కే-10 నుంచి ఇన్విక్టో వరకు అనేక మోడళ్ల కార్లను విక్రయిస్తోంది. వీటి ధరల శ్రేణి రూ.3.99 లక్షల నుంచి ప్రారంభమై రూ.28.92 లక్షల వరకు ఉంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.