How to Check the Freshness of Eggs: గుడ్డు పోషకాల గుట్ట. ఇందులో ప్రోటీన్, అమైనో యాసిడ్స్, బి కాంప్లెక్స్, విటమిన్లు, మినరల్స్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే చాలా మంది తమ డైట్లో ఎగ్స్ ఉండేలా చూసుకుంటారు. బాయిల్డ్ ఎగ్, ఆమ్లెట్, బుర్జీ, ఫ్రై, కూర అంటూ రకరకాలుగా తమ ఆహారంలో భాగం చేసుకుంటారు. ఈ క్రమంలోనే ఎక్కువ మొత్తంలో గుడ్లను కొనుగోలు చేస్తుంటారు.
అయితే గుడ్లు ఎక్కువ రోజుల నిల్వ ఉంటే వాటిని ఉడకబెట్టే సమయంలో పగిలిపోయి తెల్లసొన బయటకు వచ్చేయడం, ఉడికిన తర్వాత పిండిలా గట్టిగా ఉండటం జరుగుతుంటాయి. ఇలాంటి కోడిగుడ్లను తింటే అనారోగ్యం పాలయ్యే ప్రమాదం ఉంది. అందుకే తాజా గుడ్లు మాత్రమే తినాలని నిపుణులు చెబుతుంటారు. మరి గుడ్డు పాడైందా? లేదా తాజాగా ఉందా? అనే విషయం గుర్తించడం కష్టం. అందుకోసం ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ ఆథారిటీ ఆఫ్ ఇండియా కొన్ని టిప్స్ సూచిస్తోంది. అవేంటో ఈ స్టోరీలో చూద్దాం.
వాటర్ టెస్ట్: గుడ్డు ఫ్రెష్‌గా ఉందే లేదో తెలుసుకోవడానికి వాటర్ టెస్ట్ ఉపయోగపడుతుందని ఎఫ్ఎస్ఎస్ఏఐ(FSSAI) చెబుతోంది. అందుకోసం ఒక గాజు గ్లాస్‌లో వాటర్ పోసి అందులో ఎగ్ వేయాలి. అది నీటిలో అడ్డంగా మునిగినట్త్లెతే ఫ్రెష్‌గా ఉందని అర్థమట. ఒకవేళ నీటిలో పూర్తిగా మునగకుండా కొంచెం పైకి తేలితే ఆ గుడ్డు వయసు మూడు నుంచి నాలుగు వారాలున్నట్లు లెక్క. ఇక నీటిపైన పూర్తిగా తేలుతున్నట్త్లెతే అది బాగా పాత గుడ్డు అని, ఇలాంటి ఎగ్స్‌ను అస్సలు తినొద్దని చెబుతున్నారు.
బ్రేకింగ్ : గుడ్డును పగలగొట్టిన తర్వాత కూడా అది తాజా గుడ్డు అవునో కాదో తెలుసుకోవచ్చని చెబుతున్నారు. అందుకోసం ఒక ప్లేట్‌లోకి ఎగ్ బ్రేక్ చేసి పోయాలి. పచ్చసొన గ్రుండంగా ఉండి, బాగా కనిపిస్తుంటే అది తాజాగా ఉన్నట్టు. అలా కాకుండా పచ్చసొన్న గుడ్డు తెల్ల సొనతో కలిసిపోతే ఎక్కువ రోజులు అయినట్లు అర్థం చేసుకోవాలట.
ఇది కూడా: గుడ్డు కొనేముందు కూడా ఓ చిట్కా పాటించాలని చెబుతున్నారు. అది ఏంటంటే, గుడ్డును చెవి దగ్గర పెట్టుకుని షేక్ చేయాలి. సౌండ్ ఎక్కువగా వస్తే అది పాడైనట్లు లెక్క. గుడ్డు పెంకు పోరస్‌లా పనిచేస్తుంది. దీని ద్వారా గుడ్డులోని తేమ బయటకు వెళ్లి, దాని ప్లేస్‌లో గాలి నిండుతుంది. గుడ్డు ఎంత పాతదైతే దానిలో అంత గాలి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి గుడ్డు ఊపినప్పుడు సౌండ్ ఎక్కువగా వస్తే అది పాడైనట్లు అర్థం చేసుకోవాలంటున్నారు. శబ్ధం తక్కువగా ఉంటే ఆ గుడ్డు తాజాగా ఉన్నట్లు లెక్కని నిపుణులు చెబుతున్నారు.
కోడి గుడ్లు తిని బోర్ కొడుతోందా?- అయితే, ఓసారి ఈ ఎగ్స్‌ను ట్రై చేయండి
వైట్ ఎగ్.. బ్రౌన్ ఎగ్ - ఏ గుడ్డులో ఎక్కువ పోషకాలు ఉంటాయో మీకు తెలుసా?