ఘనంగా దుబ్బాక జన్మదిన వేడుకలు - నల్గొండ జిల్లా వార్తలు
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దుబ్బాక నర్సింహారెడ్డి జన్మదిన వేడుకలు నల్గొండ జిల్లా చిట్యాలలో ఘనంగా నిర్వహించారు. స్థానిక కనకదుర్గ ఆలయం ముందు నాయకులు కేక్ కట్ చేశారు.
చిట్యాలలో దుబ్బాక నర్సింహారెడ్డి జన్మదిన వేడుకలు
నల్గొండ జిల్లా చిట్యాలలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దుబ్బాక నర్సింహారెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక కనకదుర్గ ఆలయం ముందు నాయకులు కేక్ కట్ చేశారు. పలువురికి పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు దుబ్బాక వెంకట్ రెడ్డి, కౌన్సిలర్లు జడల పూలమ్మ చిన్నమల్లయ్య, రెమిడాల లింగస్వామి, జమాండ్ల జయమ్మ శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.