ETV Bharat / state

సీఎంకు సంక్రాంతి ఆఫర్ ఇస్తున్నా - లై డిటెక్టర్‌ పరీక్షకు నేను రెడీ, మీరు రెడీనా? : కేటీఆర్ - ED IN FORMULA E RACE CASE

ఎన్నిసార్లు పిలిచినా వస్తా, ఎన్నిప్రశ్నలు వేసినా సంతృప్తికర సమాధానం ఇస్తానన్న కేటీఆర్ - అడిగిన ప్రశ్నలనే తిప్పి తిప్పి అడిగారని వ్యాఖ్యలు - రేవంత్‌రెడ్డికి సంక్రాంతి ఆఫర్ ఇస్తున్నానని ప్రకటన

BRS WORKING PRESIDENT KTR
ED INVESTIGATED KTR (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 16, 2025, 6:51 PM IST

Updated : Jan 16, 2025, 7:36 PM IST

ED Investigates KTR Formula E Race Case : ఏసీబీ లాగానే ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్​ కూడా అడిగిన ప్రశ్నలనే మళ్లీ మళ్లీ అడిగిందని బీఆర్​ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. 7 గంటల పాటు కొనసాగిన ఈడీ విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అడిగిన ప్రశ్నలనే తిప్పి తిప్పి అడిగారని, విచారణకు ఎన్నిసార్లు పిలిచినా వస్తానని ఈడీకి చెప్పినట్లు కేటీఆర్ తెలిపారు.

రేవంత్‌పై ఈడీ కేసు ఉందనే : తాను ఏ తప్పు చేయకున్నా చట్టాలను గౌరవించే పౌరుడిగా విచారణకు వచ్చానని, ఒక్క రూపాయి అవినీతి చేయలేదని స్పష్టం చేశారు. రేవంత్‌రెడ్డిపై ఈడీ కేసు ఉందని, అందుకే తనపై కూడా కేసు పెట్టించారని కేటీఆర్ ఆరోపించారు. జడ్జి ముందు ప్రత్యక్ష విచారణకు సిద్ధమని, దమ్ముంటే సీఎం రేవంత్‌రెడ్డి రావాలని సవాల్ విసిరారు.

నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమే : తనపై పెట్టిన కేసుల్లో లై డిటెక్టర్‌ పరీక్షకు కూడా తాను సిద్ధమని కేటీఆర్ ప్రకటించారు. తనకు కోర్టులు, జడ్జిలపై నమ్మకం ఉందని, చివరకు న్యాయమే గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తాను తప్పు చేయలేదని, చేయబోనని, తప్పు చేశానని నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమని ఈ సందర్భంగా తెలిపారు.

సీఎం రేవంత్‌ రెడ్డికి సంక్రాంతి ఆఫర్ ఇస్తున్నా: కేటీఆర్ (ETV Bharat)

రేవంత్‌రెడ్డికి సంక్రాంతి ఆఫర్ ఇస్తున్నా. రేవంత్‌ ఇద్దరం లై డిటెక్టర్ పరీక్షలు చేయించుకుందాం. లైవ్‌లో లై డిటెక్టర్ పరీక్షలకు నేను సిద్ధం. లై డిటెక్టర్ పరీక్షలకు తేదీ, సమయం, స్థలం రేవంత్‌రెడ్డి ఇష్టం. మళ్లీ విచారణకు రావాలని ఈడీ చెప్పలేదు పిలిస్తే వస్తాను. -కేటీఆర్

నా ఆదేశాలతోనే నిధులు మంజూరు - ఏసీబీ విచారణలో కేటీఆర్ కీలక విషయాలు వెల్లడి

ముగిసిన కేటీఆర్ విచారణ - 7 గంటల పాటు ప్రశ్నించిన ఈడీ

Last Updated : Jan 16, 2025, 7:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.