IAS SRILAXMI: ఐఏఎస్ శ్రీలక్ష్మీపై కఠిన చర్యలొద్దు: తెలంగాణ హైకోర్టు - ఐఏఎస్ శ్రీలక్ష్మి తాజా వార్తలు
ఓఎంసీ కేసులో (omc case) ఏపీకి చెందిన ఐఏఎస్ శ్రీలక్ష్మిపై కఠిన చర్యలు తీసుకోవద్దని సీబీఐ (cbi) కోర్టుకు రాష్ట్ర హైకోర్టు (ts high court) మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో చార్జిషీట్‌పై విచారణ ఆపాలన్న శ్రీలక్షి పిటిషన్‌పై హైకోర్టు ఇవాళ విచారణ జరిపింది.

ఓబుళాపురం గనుల కేసు (obulapuram mining company case)లో చార్జిషీట్‌పై విచారణ ఆపాలన్న ఏపీ ఐఏఎస్ అధికారి శ్రీలక్షి (ias sri laxmi) పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో (ts high court) విచారణ జరిగింది. సరిహద్దు వివాదంపై దర్యాప్తు పూర్తయ్యే వరకు విచారణ ఆపాలని ఆమె తరఫు న్యాయవాది కోరారు.
ఓఎంసీ కేసు దర్యాప్తు పూర్తయిందని మరో చార్జిషీట్ వేయబోమని సీబీఐ (cbi) న్యాయస్థానానికి తెలిపింది. దర్యాప్తు అధికారి వాంగ్మూలాన్ని సీబీఐ కోర్టు ఇప్పటికే పరిగణనలోకి తీసుకుందన్నారు. వాదనలు వినిపించనందుకు సీబీఐ కోర్టు ఇప్పటికే రూ.4వేలు జరిమానా విధించిందన్న శ్రీలక్ష్మి.. ఈనెల 12న వాదించకపోతే డిశ్చార్జి పిటిషన్‌పై నిర్ణయం తీసుకుంటామని సీబీఐ కోర్టు తెలిపిందన్నారు. వాదనలు విన్న న్యాయస్థానం శ్రీలక్ష్మిపై కఠిన చర్యలు తీసుకోవద్దని సీబీఐ కోర్టుకు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది.
ఇదీ చదవండి: KODANDARAM: 'ఆ ప్రచారాన్ని నమ్మకండి: కోదండరాం'