ETV Bharat / state

'కవల పిల్లల నడుమ కేసీఆర్​ పుట్టినరోజు వేడుకలు' - Save Society KCR Birthday Celebrations

హైదరాబాద్​ నాంపల్లి లలితకళాతోరణంలో సీఎం కేసీఆర్​ జన్మదిన వేడుకలు వినూత్నంగా చేపట్టారు. సేవ్​ సొసైటీ ఆధ్వర్యంలో కవలలందరూ కలసి 2 కె రన్​ చేయడమే గాక... కేసీఆర్​ అనే అక్షరాలు వచ్చేలా వారంతా ఒక్కచోట చేరడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

KCR Birthday
KCR Birthday
author img

By

Published : Feb 16, 2020, 5:17 PM IST

ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను సేవ్​ సొసైటీ ఆధ్వర్యంలో నగరంలోని నాంపల్లి లలిత కళా తోరణంలో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్సీలు శ్రీనివాస్ రెడ్డి, నవీన్ రావు, టాలీవుడ్ ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వేడుకలకు పెద్దఎత్తున కవల పిల్లలు హాజరవడం విశేషం.

వారంతా కలసి 2 కె రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కేసీఆర్ అనే అక్షరాలు వచ్చే విధంగా ఒక్కచోట చేరారు. అనంతరం కేక్​ కత్తిరించారు. సీఎం పుట్టినరోజును పురస్కరించుకుని ట్విన్స్ అందరూ ఒకే వేదికపైకి వచ్చి సంబురాలు జరుపుకోవడం సంతోషంగా ఉందని ఎమ్మెల్సీలు నవీన్‌రావు, శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

కవల పిల్లల నడుమ కేసీఆర్​ పుట్టినరోజు వేడుకలు

ఇదీ చూడండి : మల్లన్న స్వామికి బోనమెత్తిన మహిళలు

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.