Russian Baba At Maha Kumbh Mela : తీరొక్క రకం బాబాలతో ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభ మేళా కళకళలాడుతోంది. దేశవిదేశాల నుంచి తరలివచ్చిన బాబాలు భక్తజనాన్ని ఆకట్టుకుంటున్నారు. రష్యాకు చెందిన బాహుబలి బాబా సైతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. 7 అడుగుల ఎత్తు, కండలు తిరిగిన దేహం, అందమైన ముఖ వర్ఛస్సును కలిగి ఉండటంతో ఆయన్ను అందరూ బాహుబలి బాబా అని పిలుస్తున్నారు. ఆయన వివరాలతో కథనమిది.

బాహుబలి బాబా సనాతన ధర్మంలోకి ఎలా వచ్చారు?
బాహుబలి బాబా అసలు పేరు ఆత్మప్రేమ్ గిరి మహరాజ్. ఈయన రష్యా దేశానికి చెందినవారు. ప్రపంచంలోని చాలా దేశాల్లో టూరిస్టుగా ఈ బాబా తిరిగారు. ఈ క్రమంలోనే 30 ఏళ్ల క్రితం భారత పర్యటనకు రావడం ఆయనకు టర్నింగ్ పాయింట్‌గా మారింది. భారత పర్యటనలో ఉండగా సనాతన ధర్మంతో బాహుబలి బాబాకు పరిచయం ఏర్పడింది. హిందూ ధర్మం గొప్పతనాన్ని గ్రహించిన ఆయన, వెంటనే దాన్ని స్వీకరించారు. తన పేరును ఆత్మప్రేమ్ గిరి మహరాజ్‌గా మార్చుకున్నారు. ఈక్రమంలో పైలట్ బాబాకు శిష్యుడిగా మారిపోయారు. భారత్‌లోనే కొంతకాలం ఉండి హిందూ పురాణాలు, ఇతిహాసాలను చదివారు. దీని తర్వాత బాహుబలి బాబా నేపాల్‌కు వెళ్లి అక్కడే సనాతన ధర్మాన్ని ప్రచారం చేస్తున్నారు. హిందూ ధర్మంలోకి ప్రవేశించకముందు ఆయన రష్యాలో ఉపాధ్యాయుడిగా పనిచేసేవారు. కుంభమేళా, మహాకుంభ మేళా జరిగినప్పుడల్లా బాహుబలి బాబా నేపాల్ నుంచి భారత్‌కు వచ్చి వెళ్తుంటారు.



సోషల్ మీడియాలో హల్‌చల్
ఆత్మప్రేమ్ గిరి మహరాజ్(బాహుబలి బాబా) సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంటారు. ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా వేదికల్లో ప్రకంపనలు సృష్టిస్తుంటారు. ఆయన ఆసక్తికర ఆధ్యాత్మిక ప్రసంగాలను చాలా మంది చూస్తుంటారు. బాహుబలి బాబా ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లోని ఫొటోలను చూస్తే, ఆయనకు వ్యాయామం, యోగా, ధ్యానంపై ఎంతటి ఆసక్తి ఉందో అర్థమైపోతుంది. ఆహారం, పానీయాల విషయంలోనూ ఆయన ప్రత్యేక శ్రద్ధ పెడుతుంటారు. దేహ సౌష్టవం ఆకట్టుకునేలా ఉండటంతో ఈ బాబాను కొందరు నెటిజన్లు భీముడు అని, మరికొందరు పరశురాముడు అని పిలుస్తుంటారు.

త్రివేణీ సంగమంలో అదానీ కుటుంబం పూజలు
మహాకుంభ మేళా సందర్భంగా ప్రయాగ్ రాజ్‌లో ఉన్న త్రివేణీ సంగమంలో అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ కుటుంబసమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతోపాటు ఇస్కాన్ ఆధ్వర్యంలో ప్రయాగ్ రాజ్‌లో ఏర్పాటు చేసిన సేవా శిబిరం ద్వారా మహాకుంభ మేళాకు వచ్చిన భక్తులకు స్వయంగా భోజనాలను పంపిణీ చేశారు. భక్తుల సౌకర్యార్ధం ఇస్కాన్, అదానీ గ్రూప్ సంయుక్తంగా ఈ సేవా శిబిరాలను ఏర్పాటు చేశాయి. వీటిలో భక్తులకు ఉచితంగా భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. అంతకుముందు ప్రయాగ్ రాజ్ విమానాశ్రయానికి చేరుకోగానే అదానీ విలేకరులతో మాట్లాడారు. "మహాకుంభ మేళాలో పాల్గొంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. పుణ్యం ప్రసాదించే ఈ మహా ఘట్టంలో నేను కూడా భాగం అయ్యాను. కోట్లాది మందికి ఇది పుణ్యప్రదమైన సందర్భం" అని ఆయన చెప్పారు. "నిజానికి, సేవ అంటే అమిత దేశభక్తి. సేవ అంటే ధ్యానం. సేవా అంటే ప్రార్థన. సేవా అంటే దేవుడు" అని అదానీ తెలిపారు.
#MahaKumbh2025 | Prayagraj, Uttar Pradesh: Adani Group Chairman, Gautam Adani along with his family offers prayers at Triveni Sangam, Prayagraj pic.twitter.com/JTJyDhvsLj
— ANI (@ANI) January 21, 2025
6కేజీల ఆభరణాలతో కుంభమేళాకు 'గోల్డెన్' బాబా- ఫుల్ పాజిటివ్ ఎనర్జీ ఇస్తాయట!
మహా కుంభమేళాలో 'అంబాసిడర్' బాబా - తిండి, నిద్ర సహా అన్నీ అందులోనే!