IPL 2023 Playoffs Dot balls : పర్యావరణం పెంపొందించడం కోసం బీసీసీఐ, ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ టాటా కంపెనీస్ కలిసి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఈ మెగా లీగ్ తాజా సీజన్ ప్లే ఆఫ్స్‌లోని ప్రతి మ్యాచ్‌లో నమోదైన ఒక్కో డాట్‌బాల్‌కు 500 మొక్కలను నాటాలని నిర్ణయించారు. పర్యావరణ రక్షణ కోసం తమ వంతు బాధ్యతగా ఈ గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీంతో పర్యావరణ పరిరక్షణ కోసం బీసీసీఐ తీసుకున్న నిర్ణయంపై క్రికెట్ ప్రియులు ప్రశంసలు కూడా కురిపించారు. అయితే ఈ మెగాలీగ్ మే 29 ఆదివారంతో ఘనంగా ముగిసింది. ఈ నేపథ్యంలో ప్లే ఆఫ్స్, ఫైనల్స్ కలిసి మొత్తం ఎన్ని డాట్ బాల్స్ నమోదయ్యాయి?, ఎన్ని చెట్లు నాటబోతున్నారనే విషయంపై చర్చ మొదలైంది.
మొత్తం ఎన్ని డాట్ బాల్స్, చెట్లంటే..
ipl 2023 dot dot ball list : ఫస్ట్ క్వాలిఫయర్ గుజరాత్ టైటాన్స్ - చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో 84 డాట్ బాల్స్ నమోదయ్యాయి. అంటే 84x500 = 42,000 చెట్లు. ఈ లెక్కన ముంబయి ఇండియన్స్ - లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో (96 డాట్స్ బాల్స్ - 48000 చెట్లు), ముంబయి ఇండియన్స్ - గుజరాత్ టైటాన్స్ రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో (67 డాట్ బాల్స్ - 33,500 చెట్లు), చెన్నై సూపర్ కింగ్స్ - గుజరాత్ టైటాన్స్ ఫైనల్ మ్యాచ్‌లో (45 డాట్ బాల్స్ - 22,500 చెట్లు) నమోదయ్యాయి. అంటే మొత్తంగా.. ప్లే ఆఫ్స్‌లో ఫైనల్స్‌తో కలిపి 294 డాట్ బాల్స్ నమోదవ్వగా.. 1,47,000వేల చెట్లు నాటనున్నారు. కాగా, ఈ డాట్బాల్స్ను ఎక్కువగా మధ్వాల్, మహ్మద్ షమీ, రషీద్ ఖాన్, మథీషా పతిరాణ వేశారు. మరి ఈ చెట్లను ఎప్పుడు, ఎక్కడ నాటబోతున్నారో ఇంకా వివరాలు తెలియలేదు.
ఇక ఫైనల్ మ్యాచ్ విషయానికొస్తే(IPL 2023 CSK Win).. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. చివర్లో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా తన బ్యాటింగ్‌తో అద్భుతం చేయడం వల్ల 5 వికెట్ల తేడాతో సీఎస్కే ట్రోఫీని ముద్దాడింది.
-
We are proud to partner @TataCompanies in planting 500 saplings for each dot ball in the @IPL playoffs. Qualifier 1 #GTvsCSK got 42,000 saplings, thanks to 84 dot balls.
— Jay Shah (@JayShah) May 24, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Who says T20 is a batter’s game? Bowlers’ it’s all in your hands #TATAIPLGreenDots 🌳 🌳 🌳
">We are proud to partner @TataCompanies in planting 500 saplings for each dot ball in the @IPL playoffs. Qualifier 1 #GTvsCSK got 42,000 saplings, thanks to 84 dot balls.
— Jay Shah (@JayShah) May 24, 2023
Who says T20 is a batter’s game? Bowlers’ it’s all in your hands #TATAIPLGreenDots 🌳 🌳 🌳We are proud to partner @TataCompanies in planting 500 saplings for each dot ball in the @IPL playoffs. Qualifier 1 #GTvsCSK got 42,000 saplings, thanks to 84 dot balls.
— Jay Shah (@JayShah) May 24, 2023
Who says T20 is a batter’s game? Bowlers’ it’s all in your hands #TATAIPLGreenDots 🌳 🌳 🌳
ఇదీ చూడండి :
IPL 2023 Awards : చెన్నై పాంచ్ పటాకా.. ఈ సీజన్ అవార్డులు, రివార్డులు ఇవే!
IPL 2023 Season Records : 12 సెంచరీలు.. 200+ స్కోర్లు 37.. ఈ సీజన్ బద్దలైన రికార్డులు ఇవే