ETV Bharat / international

కిమ్​ ప్రత్యక్షమైన ఒక్క రోజులోనే అక్కడ కాల్పుల మోత

ఉభయ కొరియాల మధ్య మళ్లీ అగ్గి రాజుకుంది. సరిహద్దు వెంబడి ఉన్న తమ సైనిక స్థావరాలపై ఉత్తర కొరియా కాల్పులు జరిపిందని దక్షిణ కొరియా ఆరోపించింది. ప్రతి చర్యగా తాము కూడా కాల్పులు జరిపినట్టు పేర్కొంది. అధ్యక్షుడు కిమ్​ తిరిగొచ్చిన ఒక్క రోజులోనే ఈ కాల్పులు జరగడం గమనార్హం.

author img

By

Published : May 3, 2020, 10:28 AM IST

S Korea says troops exchange fire along N Korean border
కిమ్​ కనపడిన ఒక్క రోజులోనే అక్కడ కాల్పుల మోత

ఉభయ కొరియాల సరిహద్దు వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తమ సైనిక స్థావరంపై ఉత్తర కొరియా కాల్పులు జరిపిందని దక్షిణ కొరియా ఆరోపించింది. ప్రతి చర్యగా తాము కూడా కాల్పులు జరిపినట్టు పేర్కొంది.

అనారోగ్యం వార్తలకు చెక్​ పెడుతూ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్​ జోంగ్ ఉన్..​ 20 రోజుల అనంతరం ప్రత్యక్షమైన ఒక్క రోజులో ఈ ఘటన జరగడం గమనార్హం.

'ఉత్తర కొరియాదే తప్పు...'

తాజా కాల్పులకు ఉత్తర కొరియాదే తప్పని దక్షిణ కొరియా సంయుక్త దళాధిపతి తేల్చి చెప్పారు. సరిహద్దు వెంబడి ఉన్న తమ స్థావరాలపై కిమ్​ సైనికులు కాల్పులు జరిపినట్టు తెలిపారు. తాము హెచ్చరించినప్పటికీ కాల్పులు ఆగలేదని పేర్కొన్నారు. ప్రతిగా తాము కూడా రెండు రౌండ్ల కాల్పులు జరిపినట్టు స్పష్టం చేశారు.

కాల్పుల ఘటనలో తమ సైనికులు ఎవరూ మరణించలేదని ఉత్తర కొరియా స్పష్టం చేసింది. అయితే ఈ పూర్తి వ్యవహారంపై ఆ దేశ అధికారిక మీడియా ఎటువంటి కథనం ప్రచురించలేదు.

ఉభయ కొరియాల మధ్య 248 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. దీన్ని డీమిలిటరైజడ్​ జోన్​(డీఎమ్​జెడ్​)అని అంటారు. ఇక్కడ దాదాపు 20 లక్షల మైన్లు ఉంటాయి.

ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని గతంలో ఇరు దేశాలు నిర్ణయించాయి. ఫలితంగా 2018లో సరిహద్దు వెంబడి ఉన్న కొన్ని సైనిక స్థావరాలు, మైన్లను ధ్వంసం చేశాయి. కానీ అమెరికాకు, కిమ్​ ప్రభుత్వానికి మధ్య అణునిరాయుధీకరణ ఒప్పందంలో పురోగతి లేకపోవడం వల్ల సరిహద్దు వెంబడి ఉద్రిక్తతలు తగ్గించే చర్యలు నిలిచిపోయాయి.

ఇదీ చూడండి:- కిమ్​ ప్రత్యక్షంపై 'మిత్రుడు' ట్రంప్ హర్షం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.