ETV Bharat / international

కిమ్​ ప్రత్యక్షంపై 'మిత్రుడు' ట్రంప్ హర్షం

3 వారాల తర్వాత అజ్ఞాతం వీడారు ఉత్తర కొరియా దేశాధినేత కిమ్​ జోంగ్​ ఉన్​. ఆయన తిరిగిరావడం పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ సంతోషం వ్యక్తం చేశారు.

author img

By

Published : May 3, 2020, 9:29 AM IST

Trump says 'glad' Kim Jong Un 'is back, and well'
'కిమ్​ వచ్చారు కదా.. సంతోషంగా ఉంది'

ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ దాదాపు 3 వారాల తర్వాత బయట కనిపించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్. ఈ మేరకు ట్వీట్​ చేశారు. కిమ్​ తిరిగిరావడం ఆనందంగా ఉందన్నారు.

Trump says 'glad' Kim Jong Un 'is back, and well'
ట్రంప్​ ట్వీట్​

'' కిమ్​ తిరిగి రావడం, ఆయన ఆరోగ్యంగా ఉండడం పట్ల చాలా సంతోషంగా ఉంది.''

- డొనాల్డ్​ ట్రంప్​, అమెరికా అధ్యక్షుడు

20 రోజులుగా బయటి ప్రపంచానికి కనిపించకుండా ఉన్నారు కిమ్​ జోంగ్​ ఉన్​. ఆయన ఆరోగ్యం క్షీణించిందని ఎన్నో వదంతులు వచ్చాయి. వాటికి తెరదించుతూ.. ఓ ఎరువుల కర్మాగారం ప్రారంభోత్సవానికి శనివారం విచ్చేశారు కిమ్​. సంబంధిత వీడియోను ఉత్తర కొరియా అధికారిక న్యూస్​ ఏజెన్సీ విడుదల చేసింది.

సామాజిక మాధ్యమాల్లో ఒకరు పంచుకున్న వీడియోను.. ట్విట్టర్​లో ట్యాగ్​ చేసిన ట్రంప్​ పైవ్యాఖ్యలు చేశారు. అంతకుముందు కూడా కిమ్​ గురించి తనకు సమాచారం ఉందని, కానీ చెప్పనని అంటూ వచ్చారు ట్రంప్​.

ఇదీ చూడండి: కొరియా నేతలకు 'అదృశ్యం' కొత్తేం కాదు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.