Pfizer vaccine: 'మూడో డోస్‌తో కొవిడ్ నుంచి మరింత రక్షణ' - vaccine booster dose
ఫైజర్ సంస్థ త్వరలో మూడో డోసు(Pfizer third dose) టీకాను అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమైంది. దీనిపై అమెరికాలోని ఎఫ్‌డీఏను అనుమతి కోరనున్నట్లు ప్రకటించింది. మూడో డోసు తీసుకోవడం వల్ల యాంటీబాడీల స్థాయి గణనీయంగా పెరుగుతుందని తెలిపింది.
![Pfizer vaccine: 'మూడో డోస్‌తో కొవిడ్ నుంచి మరింత రక్షణ' pfizer vaccine 3rd dose](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12402106-thumbnail-3x2-phizer.jpg?imwidth=3840)
కొవిడ్ -19 వ్యాక్సిన్(Covid-19 vaccine) మూడో డోసుకు అమెరికా ఎఫ్‌డీఏ అనుమతి కోరనున్నట్లు ఫైజర్(Pfizer) ప్రకటించింది. మధ్యంతర క్లినికల్ ట్రయల్ డేటాను దృష్టిలో పెట్టుకొని మూడో డోసు తీసుకోవడం వల్ల యాంటీబాడీ స్థాయి ఐదు నుంచి 10 రెట్లు అధికంగా పెంచగలదని తేలినట్లు ఫైజర్ వెల్లడించింది.
కొమిర్నాటి బ్రాండ్ పేరుతో విక్రయించే ఫైజర్-బయోఎన్‌టెక్ వ్యాక్సిన్ కరోనాపై మరింత సమర్థంగా పనిచేయడానికి మూడో డోస్ అవసరమని కంపెనీ నివేదించింది. దక్షిణాఫ్రికాలో మొదట గుర్తించిన బీటా వేరియంట్, భారత్‌లో కనిపించిన డెల్టా వేరియంట్‌లకు వ్యతిరేకంగా.. ఫైజర్ వ్యాక్సిన్ మూడో డోసు తీసుకోవడం వల్ల మంచి రక్షణ లభిస్తుందని భావిస్తున్నారు. టీకాలు వేసిన ఆరు నుంచి 12 నెలల్లోపు మూడో డోసు అవసరమవుతుందని ఫైజర్ తెలిపింది.
ఇదీ చదవండి : 'వారాంతానికి 16 కోట్ల మందికి వ్యాక్సినేషన్ పూర్తి'