ETV Bharat / international

ఉక్రెయిన్ లేకుండా శాంతి చర్చలా? రష్యా, అమెరికా మీటింగ్​ రిజల్ట్​ మేం ఒప్పుకోం : జెలెన్​స్కీ - UKRAINE PRESIDENT UAE VISIT

జోరందుకున్న శాంతి చర్చల ప్రక్రియ - పశ్చిమాసియా పర్యటనలో భాగంగా యూఏఈకి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ - సౌదీకి పయనమైన అమెరికా కీలక అధికారులు

Ukraine President Zelenskyy UAE visit
Ukraine President Zelenskyy UAE visit (AP)
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 17, 2025, 3:41 PM IST

Updated : Feb 17, 2025, 4:12 PM IST

Ukraine President Zelenskyy UAE visit : యుద్ధానికి ముగింపు పలికే అంశంపై సౌదీ అరేబియాలో అమెరికా, రష్యా మధ్య జరగనున్న చర్చల్లో తమ దేశం పాల్గొనదని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రకటించారు. యూఏఈలో పర్యటిస్తున్న జెలెన్‌స్కీ ఈ మేరకు మీడియా ప్రతినిధులకు వెల్లడించారు. ఉక్రెయిన్‌ పాల్గొనని చర్చల్లో వచ్చే ఫలితాలను తాము అంగీకరించబోమని స్పష్టం చేశారు. మంగళవారం అమెరికా-రష్యా మధ్య జరగనున్న చర్చలకు తమను ఆహ్వానించలేదని జెలెన్‌స్కీ తెలిపారు. ఉక్రెయిన్‌ గైర్హాజరీలో ఆ చర్చల వల్ల ఎలాంటి ఫలితాలు ఉండబోమని అన్నారు. బుధవారం సౌదీ అరేబియాలో పర్యటించనున్నట్లు తెలిపిన జెలెన్‌స్కీ అమెరికా, రష్యా మధ్య చర్చలకు తన పర్యటనకు మధ్య సంబంధం లేదన్నారు.

ఇటీవల సౌదీ అరేబియాలో శాంతి చర్చలు జరగనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ ప్రకటించారు. దీనికోసం ఇప్పటికే అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, పశ్చిమాసియా ప్రతినిధి స్టీవ్‌ విట్‌కోఫ్‌, జాతీయ భద్రతా సలహాదారు మైక్‌వాల్ట్జ్ కూడా సౌదీకి పయణమయ్యారు. ఈ సందర్భంగా రియాద్‌లోని కొందరు అధికారులు- ఈ చర్చలకు వేదిక కావడం సహా మధ్యవర్తిత్వంలోను తమ దేశం కీలకపాత్ర పోషించనుందన్నారు.

సౌదీకి రష్యా అధికారులు
సౌదీ వేదకగా మంగళవారం జరగనున్న చర్చల్లో రష్యా అధికారులు అమెరికా ప్రతినిధులతో భేటీ అవుతారని క్రెమ్లిన్ సోమవారం ప్రకటించింది. అంతేకాకుండా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భేటీకి ఏర్పాట్లు చేస్తారని తెలిపింది. ఇందుకోసం రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్, పుతిన్ విదేశీ వ్యవహారాల సలహాదారు యూరి ఉష్కోవ్ సౌదీ రాజధాని రియాద్​కు పయనం కానున్నారని వెల్లడించింది. అమెరికా, రష్యా సంబంధాలను పునరుద్ధరించడం, ఉక్రెయిన్​తో సెటిల్​మెంట్​, ఇరు దేశాల అధ్యక్షుల భేటీకి సంబంధించిన అంశాలు చర్చకు వస్తాయని తెలిపారు.

'డేట్ అనుకోలేదు- కానీ కలుస్తాం!'
అంతకుముందు, ఉక్రెయిన్‌ లేకుండానే ఈ చర్చలు చేపడతున్నారంటూ అమెరికా మిత్రదేశాల నుంచి ఇటీవల వెల్లువెత్తిన అసంతృప్తులపై ట్రంప్‌ స్పందించారు. యుద్ధాన్ని ముగించే ఏ చర్చల్లోనైనా జెలెన్‌స్కీ భాగస్వామి అవుతారని వివరణ ఇచ్చారు. అంతేకాకుండా చాలా తొందరలో రష్యా అధినేతతో తాను భేటీ కానున్నట్లు తెలిపారు. ఆయన ఫ్లోరెడాలోని డెటోనా రేసులో పాల్గొన్న సందర్భంగా ఈ మేరకు వెల్లడించారు. "కచ్చితమైన సమయం అనుకోలేదు-కానీ, తొందర్లోనే జరుగుతుంది" అని పేర్కొన్నారు.

Last Updated : Feb 17, 2025, 4:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.