Pushpa 2 Latest News : 'పుష్ప 2'లో మైండ్ బ్లోయింగ్ సీక్వెన్స్.. అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన దేవీ శ్రీ - pushpa 2 music director
Pushpa 2 Latest News : 'పుష్ప 2' సినిమా గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్. ఆ సంగతులు..
Published : Sep 9, 2023, 4:44 PM IST
|Updated : Sep 9, 2023, 7:26 PM IST
Pushpa 2 Latest News : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న 'పుష్ప- ది రూల్' కోసం పాన్ ఇండియా మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అభిమానుల అంచనాలను మించేలా సినిమాను తీర్చిదిద్దుతున్నారు దర్శకుడు సుకుమార్. అయితే తాజాగా ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా పనిచేస్తున్న దేవి శ్రీ ప్రసాద్(pushpa 2 music director).. 'పుష్ప 2' గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్పారు. ఈ సారి సినిమా మరో స్థాయిలో ఉండనుందని తెలిపారు.
Pushpa 2 Action scene : "ఈ చిత్రం కోసం మేమంతా ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నాం. ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడే ఎక్కువ విషయాలను చెప్పలేను. కానీ ఒకటి మాత్రం చెప్పగలను. ఎవరూ ఊహించని విధంగా దర్శకుడు సుకుమార్ దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా మైండ్ బ్లోయింగ్ స్క్రిప్ట్. ఒక సీక్వెన్స్‌కు సంబంధించిన విజువల్‌ను నేను చూశాను. ఆ సీక్వెన్స్ గురించి ఇప్పుడు ఎక్కువగా చెప్పను. కానీ అది మాత్రం మైండ్ బ్లోయింగ్ సీక్వెన్స్" అని దేవిశ్రీ ప్రసాద్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ విషయంలో నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది.
Pushpa Movie Story : ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఊరమాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా సినిమాను తీర్చిదిద్దారు దర్శకుడు సుకుమార్. నేషనల్ క్రష్‌గా ఇమేజ్ సంపాదించుకున్న రష్మిక హీరోయిన్గా నటించింది. 2021లో రిలీజైన ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్లో భారీ కలెక్షన్లను అందుకుంది. ముఖ్యంగా బాలీవుడ్లో మంచి హిట్‌ను అందుకుంది.
సినిమాలో పుష్పరాజ్‌గా అల్లు అర్జున్ నటనకు దేశవ్యాప్తంగా విశేష ఆదరణ లభించింది. ఎక్కడ చూసిన అందరూ ఇదే మేనరిజాన్ని ఫాలో అయ్యేందుకు ట్రై చేశారు. ఇకపోతే రీసెంట్గా ఈ చిత్రానికి గాను అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డుకు ఎంపికైన సంగతి తెలిసిందే. ఇప్పుడీ పుష్ప ది రైజ్‌కు సీక్వెల్‌గా పుష్ప ది రూల్ భారీ స్థాయిలో గ్రాండ్‌గా రెడీ అవుతోంది. తొలి భాగానికి వచ్చిన రెస్పాన్స్‌ను దృష్టిలో పెట్టుకుని రెండో భాగాన్ని మరింత గ్రాండ్‌గా, ఎంతో జాగ్రత్తగా సిద్ధం చేస్తున్నారు మేకర్స్. ప్రస్తుతం ఈ సీక్వెల్ చిత్రీకరణ దశలో ఉంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
Alluarjun Latest Insta Post : ఫ్యాన్స్‌కు బన్నీ బిగ్ సర్ప్రైజ్.. 'పుష్ప 2' స్పెషల్ వీడియోతో
Pushpa 2 Release Date : నేషనల్ అవార్డు విన్నింగ్ జోష్‌లో బన్నీ.. పుష్ప-2 రిలీజ్ ఎప్పుడంటే?