నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి పీఎస్‌లో ఓ హెడ్‌కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం సృష్టిస్తోంది. ఎస్‌ఐ రివాల్వర్‌తో పోలీస్ స్టేషన్లోనే ఈ ఘాతుకానికి పాల్పడటం చర్చానీయంశంగా మారింది. ఘటనాస్థలిలోనే తీవ్ర రక్తస్రావంతో హెడ్‌కానిస్టేబుల్ ప్రకాశ్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న సీపీ కార్తికేయ హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. ఇందల్వాయి పీఎస్‌లో ఆత్మహత్యకు పాల్పడిన ప్రాంతాన్ని పరిశీలించి మృతుని కుటుంబ వివరాలు తెలుసుకున్నారు.
నిజామాబాద్ జిల్లాలో హెడ్‌కానిస్టేబుల్ ఆత్మహత్య - SUCIDE
నిజామాబాద్ జిల్లాలో హెడ్‌కానిస్టేబుల్ ఆత్మహత్య
09:52 September 18
Last Updated : Sep 18, 2019, 11:45 AM IST