two mens allegedly married: అతడే కావాలంటున్న యువకుడు... ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే! - యువకుల ప్రేమకథ
ఆంధ్రప్రదేశ్‌లోని మైదుకూరులో తెలంగాణకు చెందిన ఓ యువకుడు హల్‌చల్ చేశాడు. ఓ యువకుడు తనను పెళ్లి చేసుకున్నాడని చెప్పాడు. ఆ తర్వాత అతను ముఖం చాటేశాడని తెలిపాడు. అతడు తనకు కావాలని... లేకుంటే బతకలేనని వాపోయాడు.

సృష్టికి విరుద్ధమైనా అతనే కావాలంటూ నిజామాబాద్ జిల్లా తిమ్మాపూర్ గ్రామానికి చెందిన కంది సాయికుమార్ అనే యువకుడు ఏపీలోని కడప జిల్లా మైదుకూరులో హల్‌చల్ చేశారు. ఆ యువకుడిని తన వద్దకు చేర్చి తనకు న్యాయం చేయాలంటూ వేడుకున్నాడు. దుబాయ్‌లో ఉపాధి పొందుతున్న సమయంలో... మస్కట్‌లో ఉద్యోగం చేస్తున్న మైదుకూరు యువకుడితో టిక్‌టాక్ ద్వారా పరిచయమైందని సాయికుమార్ చెప్పాడు. ఒకరి సెల్‌ఫోన్ నెంబరు మరొకరు తీసుకున్నామని తెలిపాడు. ఇలా స్నేహం కొనసాగి అది కాస్తా తమ మధ్య ప్రేమగా మారిందని సాయికుమార్ పేర్కొన్నాడు. ఆ యువకుడు నన్ను చాలా ఇష్టపడ్డాడని తెలిపాడు. నువ్వు లేకపోతే నేను బతకలేనంటూ చెప్పి లేనిపోని భరోసా నాలో కల్పించాడని పేర్కొన్నాడు. తనను దుబాయ్ నుంచి మస్కట్‌కు వచ్చేలా చేసి పెళ్లి చేసుకున్నాడని చెప్పాడు. కానీ భారతదేశం వచ్చాక నాతో సరిగాలేడని వాపోయాడు. ముఖం చాటేశాడని తెలిపాడు.
"ఆ యువకుడు నీవంటే నాకు చాలా ఇష్టమని అన్నాడు. నీవు లేకపోతే నేను బతకలేనంటూ చెప్పి లేనిపోని భరోసా ఇచ్చాడు. నన్ను దుబాయ్ నుంచి మస్కట్‌కు వచ్చేలా చేసి పెళ్లి చేసుకున్నాడు. కొంత కాలం సంతోషంగా ఉన్నాము. కానీ విదేశాల నుంచి వచ్చాక తను నాకు దూరమయ్యాడు. ఆపై మైదుకూరు చేరుకుని పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు." -కంది సాయికుమార్
పోలీస్‌స్టేషన్ ఆవరణలో ఆత్మహత్యాయత్నం చేయగా యువకుడి బంధువులే వైద్యం చేయించారని వివరించాడు. యువకుడు తన వద్ద ఒకరకంగా మాట్లాడుతున్నారని, తల్లిదండ్రుల వద్ద మరో రకంగా మాట్లాడుతున్నారని తెలిపాడు. అతను లేకపోతే తాను బతకలేనంటూ... తమను ఒకటి చేయాలని వేడుకున్నాడు.
ఇదీ చదవండి: ఏ వయసులో శృంగారంపై ఆసక్తి తగ్గుతుందో తెలుసా?