23న శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం - తిరుమల తాజా వార్తలు
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల వివరాలను తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. ఈ నెల 23వ తేదీన ఏపీ సీఎం జగన్ శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని చెప్పారు. 24వ తేదీన కర్ణాటక సీఎంతో కలిసి ఏపీ సీఎం జగన్ శ్రీవారి సేవలో పాల్గొంటారని వెల్లడించారు.
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల వివరాలను తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. ఈనెల 23వ తేదీన గరుడ సేవ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు. తితిదే చరిత్రలో తొలిసారి బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ నెల 24న కర్ణాటక సీఎం యడియూరప్పతో కలిసి ఏపీ సీఎం జగన్ శ్రీవారి సేవలో పాల్గొంటారని సుబ్బారెడ్డి తెలిపారు. కర్ణాటక సీఎంతో కలిసి సీఎం జగన్ సుందరకాండ పారాయణంలో పాల్గొంటారని చెప్పారు.
తిరువీధుల్లో వాహనసేవలు ఉండవు: ప్రధాన అర్చకులు
తిరువీధుల్లో వాహన సేవలు, ఉత్సవాలు ఉండవని ప్రధాన అర్చకులు ప్రకటించారు. మహా రథోత్సవం బదులు సర్వభూపాల వాహన సేవ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వైదిక కార్యక్రమాలు యథావిధిగా జరుగుతాయన్నారు.
ఇదీ చదవండి : బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవం.. వాహన సేవల సమయాల్లో మార్పులు