Heavy Traffic on Hyderabad - Vijayawada Highway : సంక్రాంతి సంబురం ముగిసింది. ఇవాళ్టి నుంచి స్కూళ్లు, కాలేజీలు కూడా మొదలయ్యాయి. పండుగ కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ఊళ్లకు వెళ్లిన వారంతా తిరిగి వస్తున్నారు. దీంతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. చాలామంది సొంత వాహనాల్లోనే వస్తుండటంతో హైవేపై రద్దీ ఎక్కువగా ఉంది. వేల సంఖ్యలో వెహికల్స్‌తో ట్రాఫిక్ నెమ్మదిగా సాగుతోంది. చిట్యాల, పెద్దకాపర్తి, చౌటుప్పల్, తూప్రాన్‌పేట, ఆందోల్ మైసమ్మ ఆలయం వద్ద వాహనాల రద్దీ భారీగా ఉంది.
పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ పెరగడంతో హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాల కోసం సిబ్బంది 12 టోల్ బూత్‌లు ఓపెన్ చేశారు. మరోవైపు నల్గొండ, రాచకొండ పోలీసులు హైవేపై ఎక్కడా ట్రాఫిక్ జామ్ లేకుండా చూస్తున్నారు. ఈ రద్దీ రేపు కూడా కొనసాగే అవకాశముంది. రేపు ఆదివారం కావడంతో పండుగకు వెళ్లిన మిగతా వారు కూడా హైదరాబాద్ చేరుకోనున్నారు.
ముగిసిన సంక్రాంతి సందడి - మళ్లీ మొదలైన వాహనాల రద్దీ
పట్నం ఖాళీ అవుతోంది : హైదరాబాద్ - విజయవాడ రహదారిపై నిమిషానికి 330 వాహనాలు