ETV Bharat / city

జగన్​ రెడ్డి.. అదీ ఒక గెలుపేనా..?: నారా లోకేశ్ - అదీ ఒక గెలుపేనా

ఒంగోలు డెయిరీ మూసేయడానికి ఏపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. ఒంగోలులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. బెదిరించి చేసుకున్న ఏకగ్రీవాలను గెలుపు అంటున్నారని ఆక్షేపించారు. జగన్​పై దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ కేసులు ఉన్నాయని ఆరోపించారు.

nara lokesh
జగన్​ రెడ్డీ.. అదీ ఒక గెలుపేనా..?: నారా లోకేశ్
author img

By

Published : Mar 7, 2021, 7:50 AM IST

జగన్​ రెడ్డీ.. అదీ ఒక గెలుపేనా..?: నారా లోకేశ్

‘జగన్‌ రెడ్డి పిరికివారు. అందుకే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించకుండా బలవంతంగా ఏకగ్రీవాలు చేసుకుంటున్నారు. అదీ ఒక గెలుపేనా? అక్రమ కేసులు, బెదిరింపులతో ఎన్ని అడ్డంకులు సృష్టించినా నాయకులు, పార్టీ కార్యకర్తలు పోరాడుతున్నారు. పౌరుషం ఉన్న పార్టీ తెలుగుదేశం. ఎన్నికల్లో సైకిల్‌ గుర్తుకు ఓటేయండి’ అని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు.

ఏపీలోని ప్రకాశం జిల్లా ఒంగోలు నగరపాలక సంస్థ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన శనివారం రోడ్‌షో నిర్వహించారు. పాదయాత్రలో పెంచుతూ పోతానని చెప్పిన మాటకు ఇప్పుడు అర్థం తెలుస్తోందని.. నూనెలు, పప్పు, ఉప్పులు, పెట్రోల్‌, గ్యాస్‌, చింతపండు ధరలు పెంచడమే ఆయన ఉద్దేశమని ఎద్దేవా చేశారు.

ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.10 వేలు ఇచ్చినట్టే ఇచ్చి జరిమానాల రూపంలో రూ.20 వేలు నొక్కేస్తున్నారని ఆరోపించారు. ఇంటింటికీ రేషన్‌ అని చెప్పి.. కోట్లు పెట్టి వాహనాలు కొన్నారని, ఇప్పుడు జనాన్ని రోడ్డుపైకి తెచ్చారని విమర్శించారు. దిల్లీని గడగడలాడిస్తానన్న జగన్‌.. కేంద్రం ముందు మెడలు వంచి తనపై ఉన్న కేసులను విచారించకుండా ఆపాలని మొక్కుకుంటున్నారని ఎద్దేవా చేశారు. జగన్‌రెడ్డి గ్యాంగ్​ కోసం ఇంటర్‌పోల్‌ కూడా వేటాడుతోందన్నారు. రోడ్‌షోలో మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌, ఒంగోలు పార్లమెంటు తెదేపా అధ్యక్షుడు నూకసాని బాలాజీ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇవీచూడండి: చివరి దశకు ఏపీ పురపోరు... పోటాపోటీగా అధికార, విపక్షాల ప్రచారం

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.