మహిళ ఆత్మహత్యాయత్నం.. వైకాపా పాలనపై నారా లోకేశ్ ఆగ్రహం - సాతులూరులో మహిళ ఆత్మహత్యాయత్నం ఘటనలో వైకాపా నేత అరెస్టుకు నారా లోకేశ్ డిమాండ్
గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం సాతులూరులో మహిళ ఆత్మహత్యాయత్నంపై.. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. ఈ ఘటనకు కారణమైన వైకాపా నేతని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సీఎం జగన్ మహిళలకు ఇచ్చే అభయం ఇదేనా అంటూ ట్విట్టర్లో ప్రశ్నించారు.

ఓ ఒంటరి మహిళకి జీవనాధారమైన హోటల్ని.. వైకాపా నాయకుడు కబ్జా చేసేందుకు బెదిరింపులకు దిగడంపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. ఏపీలోని గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం సాతులూరుకు చెందిన మాలతి.. పిల్లలతో కలిసి ఆత్మహత్యకు యత్నించడంపై లోకేష్ స్పందించారు. మహిళలకు సీఎం జగన్ ఇచ్చే అభయం ఇదేనా అని ప్రశ్నించారు.
పిల్లలతో కలిసి మాలతి ప్రాణాలు తీసుకోవడానికి సిద్ధమైందంటే.. వేధింపులు ఏ స్థాయిలో ఉన్నాయో అర్ధమవుతుందని లోకేశ్ వ్యాఖ్యానించారు. ఆమెను వేధించిన వైకాపా నేతని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వైకాపా పాలనలో సామాన్యులకు రక్షణ లేదని.. ఆంధ్రప్రదేశ్‌ని ఆత్మహత్యల ప్రదేశ్‌గా జగన్ మార్చేశారని లోకేశ్ ఆరోపించారు. వేధింపులకు గురిచేసి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు కల్పిస్తున్నారని దుయ్యబట్టారు. ఆ పార్టీ నేతల అరాచకాలకు అడ్డూ, అదుపు లేకుండా పోతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితురాలికి సంబంధించిన వీడియోను.. లోకేశ్ ట్విట్టర్‌కు జత చేశారు.
ఇదీ చదవండి: 'మా నినాదం విశ్వనగరం.. ప్రతిపక్షాల నినాదం విద్వేష నగరం'