ETV Bharat / city

కేంద్రం ఇచ్చిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలి : లక్ష్మణ్ - తెలంగాణకు కేంద్రం నిధులు

రాష్ట్రానికి కేంద్రం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తూ అన్ని రంగాల్లో సహకరిస్తున్నా ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌ విమర్శించారు. కేంద్రం తీసుకువస్తున్న వ్యవసాయ బిల్లుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

laxman
laxman
author img

By

Published : Nov 1, 2020, 1:40 PM IST

Updated : Nov 1, 2020, 2:16 PM IST

కేంద్రం ఇచ్చిన నిధులపై తెలంగాణ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ డిమాండ్ చేశారు. తెలంగాణలో భాజపాను గెలిపించకపోయినా ప్రజా సంక్షేమానికి నిధులు ఇచ్చామని తెలిపారు. కేంద్రం సాయం చేస్తున్నా దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మెజార్టీ సభ్యుల మద్దతుతో ఆమోదం పొందిన వ్యవసాయ చట్టాలను కించపరుస్తున్నారని విమర్శించారు. రైతులు పండించిన పంటను నచ్చిన ధరకు దేశంలో ఎక్కడైనా అమ్ముకునేలా వెసులుబాటు కల్పించామని స్పష్టం చేశారు.

వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలనే సంకల్పంతో నూతన చట్టాలు తెచ్చామని లక్ష్మణ్ అన్నారు. ఇకపై మార్కెట్ యార్డుల్లో దోపిడీకి అవకాశం ఉండదనే వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తున్నారని ఆరోపించారు. నూతన విద్యుత్ బిల్లులో మీటర్లు అనే పదమే లేదని స్పష్టం చేశారు. కేంద్రం వాటా కింద ఇప్పటివరకు రూ.70 వేల కోట్లను తెలంగాణకు కేటాయించారని తెలిపారు. కేంద్రం నుంచి పంచాయతీలు, మున్సిపాలిటీలకు నిధులు రాలేదా అని ప్రశ్నించారు. రాష్ట్రానికి కేంద్రం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తూ అన్ని రంగాల్లో సహకరిస్తున్నా ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని లక్ష్మణ్‌ విమర్శించారు.

కేంద్రం ఇచ్చిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలి : లక్ష్మణ్
  1. ఇదీ చూడండి : 'నీ దగ్గర ఛాయ్ బావుంటుందంటా... నాకు ఇవ్వూ'
Last Updated : Nov 1, 2020, 2:16 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.