రాష్ట్రంలో మళ్లీ కరోనా విజృంభణ.. కొత్తగా 364 కేసులు - corona virus death toll in telangana
తెలంగాణలో కరోనా మళ్లీ కోరలు చాస్తోంది. కొత్తగా 364 కేసులు నమోదయ్యాయి. మహమ్మారి సోకి ఇద్దరు మృతి చెందారు.
రాష్ట్రంలో కొవిడ్ కేసుల సంఖ్య క్రమేణా పెరుగుతోంది. తాజాగా 364 మందికి వైరస్ సోకింది. జీహెచ్ఎంసీ పరిధిలో 75 మంది మహమ్మారి బారిన పడ్డారు. మొత్తం బాధితుల సంఖ్య 3,02,724కి పెరిగింది.
వైరస్‌కు మరో ఇద్దరు బలయ్యారు. ఇప్పటివరకు మహమ్మారితో 1,666 మంది మరణించారు. తాజాగా 189 మంది బాధితులు డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 2,98,451 మంది కొవిడ్‌ను జయించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,607 యాక్టివ్ కేసులున్నాయి. ప్రస్తుతం 980 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు.
కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించడం వల్ల వైరస్ అతి వేగంగా వ్యాప్తి చెందుతోందని వైద్యవర్గాలు భావిస్తున్నాయి. ప్రజలంతా కరోనా నిబంధనలు పాటిస్తూ వైరస్ బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని వైద్య, ఆరోగ్య శాఖ సూచించింది.
ఇదీ చదవండి : కొవిడ్ ఉద్ధృతి.. 45 ఏళ్లు దాటిన వారందరికీ టీకాలు!