ETV Bharat / bharat

షీనా బోరా హత్య కేసు.. ఆరేళ్ల తర్వాత విడుదలైన ఇంద్రాణీ - షీనా బొరా కేసు ఇంద్రాణి

Indrani Released: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న ఇంద్రాణి ముఖర్జియా శుక్రవారం బెయిల్​పై విడుదలయ్యారు. 2012లో జరిగిన ఆ హత్యకేసు విచారణ పూర్తికావడానికి మరికొంత సమయం పట్టనుండటం వల్ల సుప్రీంకోర్డు బుధవారం బెయిల్​ మంజూరు చేసింది.

Indrani Released:
Indrani Released:
author img

By

Published : May 20, 2022, 6:56 PM IST

Indrani Released: ఏడేళ్ల క్రితం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలు, షీనా తల్లి ఇంద్రాణీ ముఖర్జియా బెయిల్​పై విడుదలయ్యారు. విచారణ పూర్తయ్యేందుకు చాలా సమయం పట్టనుండటం వల్ల ఆమెకు బెయిల్​ ఇస్తున్నట్లు సుప్రీం కోర్టు బుధవారం వెల్లడించింది. ఆరున్నరేళ్లుగా కస్టడీలో ఉన్న ఆమె శుక్రవారం సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో జైలు నుంచి బయటకు వచ్చారు. బెయిల్​పై విడుదలైనందుకు సంతోషంగా ఉన్నట్లు విలేకరులతో తెలిపారు. మీడియా అడిగిన మిగతా ప్రశ్నలకు మాత్రం ఆమె స్పందించలేదు.

షీనా బోరా హత్య కేసు ఇదీ.. 2012లో షీనా బోరా హత్య జరగ్గా.. మూడేళ్ల తర్వాత ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ కేసులో ఇంద్రాణీ డ్రైవర్‌ శ్యామ్‌ రాయ్‌ అరెస్టయ్యాడు. అతడిని విచారిస్తున్న క్రమంలో.. 2012లో షీనాను ఇంద్రాణీ గొంతు నులిమి హత్యచేశారని చెప్పాడు. అంతేగాక, ఇంద్రాణీ ఆమెను తన చెల్లిగా పరిచయం చేసినట్లు తెలిపాడు. దీంతో ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ తర్వాత ముమ్మరంగా దర్యాప్తు చేయగా షీనా.. ఇంద్రాణీ కుమార్తేనని తేలింది. ఇంద్రాణీ మొదటి భర్త నుంచి విడిపోయిన తర్వాత తన కుమార్తె షీనా, కుమారుడు మైఖెల్‌ను గువాహటిలోని తన తల్లిదండ్రుల వద్ద ఉంచేసింది. ఆ తర్వాత కొన్నాళ్లకు సంజీవ్‌ ఖన్నా అనే వ్యక్తిని వివాహం చేసుకుని అతడి నుంచి కూడా విడిపోయింది. తర్వాత ప్రముఖ మీడియా ఎగ్జిక్యూటివ్‌ పీటర్‌ ముఖర్జియాను వివాహం చేసుకొంది.

పెద్దయ్యాక తల్లి గురించి తెలుసుకున్న షీనా.. ముంబయికి వెళ్లి ఇంద్రాణీని కలిసింది. అయితే, ఇంద్రాణీ మాత్రం షీనాను అందరికీ చెల్లిగా పరిచయం చేసింది. ఈ క్రమంలోనే పీటర్‌ మొదటి భార్య కుమారుడైన రాహుల్‌ ముఖర్జియా షీనాకు పరిచయం ఏర్పడి అది ప్రేమకు దారితీసింది. అదే సమయంలో షీనా.. ఇంద్రాణీ మధ్య ఆర్థిక విభేదాలు తలెత్తాయి. దీంతో షీనా తల్లిని బ్లాక్‌మెయిల్ చేయడం మొదలుపెట్టింది. దీంతో విసిగిపోయిన ఇంద్రాణీ.. తన రెండో భర్త సంజీవ్‌, డ్రైవర్‌ శ్యామ్‌ రాయ్‌ సాయంతో షీనాను గొంతునులిమి హత్య చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని రాయ్‌గఢ్‌లోని ఓ అటవీ ప్రాంతంలో దహనం చేసినట్లు తెలిసింది. ఈ కేసులో ఇంద్రాణీ, సంజీవ్‌లతో పాటు పీటర్‌ ముఖర్జియాను కూడా అరెస్టు చేశారు. అయితే జైల్లోనే ఇంద్రాణీ - పీటర్‌ల వివాహ బంధానికి ముగింపు పడింది. 2019లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. 2020లో పీటర్‌ బెయిల్‌పై విడుదలయ్యారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.